తెలంగాణ కెరటం, జగిత్యాల ప్రతినిధి, నవంబర్ 21 : కోరుట్ల పట్టణంలోని హ్యాపీ స్కూల్ లో "సమాజ సేవకులు" అనే పాఠ్యాంశంలో భాగంగా చిన్నారులు శనివారం స్థానిక పోలీస్ స్టేషన్ ను సందర్శించారు. ఈ సందర్భంగా చిన్నారులు పోలీసులతో మాట్లాడి, వారి విధుల గురించి ఆసక్తిగా ప్రశ్నలు అడిగారు. ప్రజల భద్రత కోసం పోలీసులు చేసే పనులను, ఆపదలో ఉన్న వారికి వారు ఎలా సహాయం అందిస్తారో, పోలీసు సిబ్బంది పిల్లలకు సరళంగా వివరించారు. చిన్నారుల ప్రశ్నలకు ఓపికగా సమాధానాలు ఇచ్చారు. ప్రజల భద్రత కోసం 24/7 పనిచేస్తూ, అవసరమైన సమయంలో అండగా నిలుస్తున్న పోలీసులకు చిన్నారులు కృతజ్ఞతలు తెలిపారు. ప్రేమతో గ్రీటింగ్ కార్డులు అందించి, "మాకు, మన సమాజానికి మీరు చేస్తున్న సేవలకు ధన్యవాదాలు” అని చెప్పారు. చిన్నారులతో ఆప్యాయంగా మాట్లాడి, వారి సందేహాలను తీర్చిన పోలీస్ అధికారులు, సిబ్బందికి హాపీ స్కూల్ ప్రిన్సిపాల్ రాసబక్తుల సంతోష్ కుమార్, ఛైర్మన్ జుక్కం తాజ్ ధన్యవాదాలు తెలిపారు.
హ్యాపీ’ స్కూల్ విద్యార్థుల పోలీస్ స్టేషన్ సందర్శన
మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి
తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags:
తహసీల్దార్ సంతకం ఫోర్జరీ.. ముగ్గురిపై కేసు భూమి కోసం నకిలీ పత్రాల సృష్టి
రామారెడ్డి మండలంలో కలకలం
శ్రీ సరస్వతీ విద్యా మందిర్ విద్యార్థులను ఉద్దేశించి అనుగ్రహ భాషణం
మద్దూరులో పోలీసుల మెరుపు దాడులు
కాచెరువు శిఖం భూమిని కాపాడాలి



