తెలంగాణ కెరటం, జగిత్యాల ప్రతినిధి, నవంబర్ 21 : అమెరికాలోని కొలంబియా, చికాగో విశ్వవిద్యాలయాల్లో భారత ఎన్నికల వ్యవస్థ, ఆర్థిక ప్రగతిపై రాహుల్ గాంధీ మాట్లాడిన మాటలు విదేశీ గడ్డపై దేశ ప్రతిష్టను దిగజార్చడమేనని భారత్ సురక్ష సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు, మాజీ కౌన్సిలర్ ఏసిఎస్ రాజు విమర్శించారు. ఈ సందర్భంగా శనివారం స్థానిక కార్యాలయంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు, మాజీ కౌన్సిలర్ ఏసిఎస్ రాజు, నాయకులు చిట్ల గంగాధర్, అక్కినపల్లి కాశీనాథంలు మాట్లాడుతూ.. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం మనదని, సామాన్యుడు సైతం చట్టసభలకు ఎన్నిక అయ్యే అవకాశం ఇక్కడ ఉందని, కానీ రాహుల్ గాంధీ మాత్రం భారత దేశంలో ప్రజాస్వామ్యం, ఎన్నికల ప్రక్రియపై దాడి జరుగుతుందని, ఎన్నికల వ్యవస్థలో లోపాలు ఉన్నాయని, విదేశీ గడ్డపై ఆరోపణ చేయటం బాధ్యతయుతమైన ప్రతిపక్ష నేతకు తగదని ఆరోపించారు. మోడీ నాయకత్వంలో భారత ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతూ, ప్రపంచంలోనే టాప్-05 ఆర్థిక వ్యవస్థలలో ఒక్కటిగా నిలిచిందని, మౌలిక సదుపాయాలు విస్తారంగా అభివృద్ధి చెందాయని, విదేశీ పెట్టుబడులు పెరిగాయని కానీ, ఇవన్నీ రాహుల్ గాంధీకి కనిపించలేదని వీటిని విస్మరించి, దేశం ఆర్థిక సంక్షోభంలో ఉందని యువతకు సరైన ఉపాధి లేదని ఆరోపణ చేయటం దేశ పరువును తీయడమేనని, దేశ వ్యతిరేక ప్రచారకుడిగా తయారయ్యాడని, ఇలాంటి వ్యక్తినీ కాంగ్రెస్ భజనపరులు ప్రధానిగా ప్రచారం చేసుకోవడం సిగ్గుచేటనీ, వారి అవివేకానికి నిదర్శనమని, ఇకనైనా బాధ్యత యుతమైన ప్రతిపక్ష నేతగా వ్యవహరించాలని అన్నారు. ఈ సమావేశంలో 22,వ వార్డు కౌన్సిలర్ అరవ లక్ష్మి, నాయకులు సింగం గంగాధర్, వేముల దేవరాజం, ఎడమల వెంకట్ రెడ్డి, ఆర్ఎస్ఎస్ వీరన్న, కొత్తకొండ బాలన్న, బాశెట్టి దుబ్బ రాజం, రాయికల్ ఆంజనేయులు పాల్గొన్నారు.
విదేశీ గడ్డపై రాహుల్ గాంధీ వ్యాఖ్యలను ఖండించిన భారత్ సురక్ష సమితి నాయకులు
మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి
తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags:
తహసీల్దార్ సంతకం ఫోర్జరీ.. ముగ్గురిపై కేసు భూమి కోసం నకిలీ పత్రాల సృష్టి
రామారెడ్డి మండలంలో కలకలం
శ్రీ సరస్వతీ విద్యా మందిర్ విద్యార్థులను ఉద్దేశించి అనుగ్రహ భాషణం
మద్దూరులో పోలీసుల మెరుపు దాడులు
కాచెరువు శిఖం భూమిని కాపాడాలి



