తెలంగాణ కెరటం బాగా కూడా నియోజకవర్గంలో ప్రతినిధి నవంబర్ 21 :
నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండలం తిమ్మాపూర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో శనివారం రోజు ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు ప్రొసీడింగ్ పత్రాలను గ్రామ సర్పంచ్ పుప్పాల నరేష్ అందజేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ ఫలాలు పారదర్శకంగా అందాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ, లబ్ధిదారులు మంజూరు పత్రాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గ్రామాభివృద్ధితో పాటు అర్హులైన పేదలకు చేయూత అందించడానికి గ్రామ పంచాయతీ ఎల్లప్పుడూ ముందుంటుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ సదానంద్ గౌడ్, వార్డు సభ్యులు, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.



