తెలంగాణ, కెరటం స్టేట్ ఇంచార్జ్ షేక్ మహబూబ్ 21, నవంబర్
ఐబీ గెస్ట్ హౌస్‌లో కేక్ కట్ చేయించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన జగ్గారెడ్డి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) ప్రధాన కార్యదర్శి తోపాజీ అనంత్ కిషన్ జన్మదిన వేడుకలు సంగారెడ్డిలో ఘనంగా జరిగాయి. పట్టణంలోని ఐబీ గెస్ట్ హౌస్ ప్రాంగణంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానుల సమక్షంలో పుట్టినరోజు వేడుకలను నిర్వహించారు.ఈ వేడుకలకు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి హాజరై తోపాజీ అనంత్ కిషన్‌తో కేక్ కట్ చేయించారు. అనంతరం ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై తోపాజీ అనంత్ కిషన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఐబీ గెస్ట్ హౌస్ ప్రాంగణంలో జన్మదిన వేడుకలు సందడిగా సాగాయి.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు జార్జ్, మహేష్ ముదిరాజ్, రమేష్, గంగేరి శ్రీహరి,కుమార్, కరంజీత్ సింగ్ తో పాటు తోపాజీ అనంత్ కిషన్ అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.



