Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

వెలుగుల ఉదయం చూడాలి...మంజుల పత్తిపాటి.

వెలుగుల ఉదయం చూడాలి...మంజుల పత్తిపాటి.
వెలుగుల ఉదయం చూడాలి...మంజుల పత్తిపాటి.
వెలుగుల ఉదయాన్ని చూడాలని నిద్ర పట్టక
రేయిలో జారిన సిరాచుక్క చెప్తోంది...
ఇసుక గూళ్లు కట్టుకున్నే వయసులో
ఇటుకల తట్టలు ఇంకా ఎన్ని రోజులు 
మోయలని..?వెలుగుల ఉదయాన్ని చూడాలని నిద్ర పట్టకరేయిలో జారిన సిరాచుక్క చెప్తోంది...
ఆకలి పేగులు మెలిపెడుతుంటే
కనుపాపలకు కునుకు ఎలా వస్తుంది అని..?
కరెంటు కోతలతో వేడెక్కిన స్టాటరులతో మోటార్లు 
చనిపోతుంటే...నీళ్లు లేక పొలాలు ఎండిపోతుంటే...
రైతన్నల చిరునవ్వుల హారాలు తెగిపోయి
కుటుంబాలకు దూరం అవుతున్నారు అని 
రేయిలో జారిన సిరాచుక్క ఆవేదన చెందుతోంది..!
రంగుల ప్రపంచంలో ప్లాస్టిక్ జీవితం ఎప్పుడు అంతం అవుతుంది అని నా కలం ఆడుగుతోంది..!
గాలికి కొట్టుకుపోయే బతుకులకు
వరదల జల్లు కాదు..కన్నీటిని తుడిచే చినుకులు కావాలనినా కలం కోరుకుంటోంది..!స్టేటస్‌ల సముద్రంలో మునిగిపోయిన మనసులకుఆప్యాయతల అలలు తాకాలనినా కలం కోరుకుంటోంది..!రచన: మంజుల పత్తిపాటి చరవాణి 9347042218 
మాజీ ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ యాదాద్రి భువనగిరి జిల్లా తెలంగాణ రాష్ట్రం.
మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: