Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

జోగిపేటలో మెఘా హాస్పిటల్ ప్రారంభం

Author
Posted By TELANGANA KERATAM
| 23 Nov 2026, 06:06 AM | 1 | Sports, TELANGANA, తెలంగాణ
జోగిపేటలో మెఘా హాస్పిటల్ ప్రారంభం

అందోల్ నియోజకవర్గ ప్రజలకు ఆధునిక వైద్య సేవలు

అందుబాటులోకి ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ చేతుల మీదుగా ప్రారంభోత్సవం

తెలంగాణ, కెరటం స్టేట్ ఇంచార్జ్ షేక్ మహబూబ్ 22, నవంబర్ అందోల్ నియోజకవర్గ ప్రజలకు మెరుగైన, నాణ్యమైన ఆధునిక వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో జోగిపేట పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన మెఘా హాస్పిటల్‌ను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ నవంబర్ 22న ప్రారంభించారు.అందోల్ నియోజకవర్గంలోని ఏడు మండలాల ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో అన్ని ఆధునిక వైద్య సదుపాయాలతో ఈ ఆసుపత్రిని ఏర్పాటు చేసినట్లు యాజమాన్యం వెల్లడించింది. ఆసుపత్రిలో లాపరోస్కోపిక్ సర్జరీలు, ఆర్థోపెడిక్స్, ఇన్ఫెర్టిలిటీ, రేడియాలజీ, ఆధునిక ల్యాబ్, రక్త పరీక్షలు, ఐసీయూ, అత్యవసర వైద్య సేవలు, స్పెషల్ రూమ్స్, జనరల్ వార్డులు, జనరల్ మెడిసిన్, గైనకాలజీ వంటి విభాగాల్లో వైద్య సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపింది.ఈ సందర్భంగా ఆసుపత్రి యాజమాన్యానికి చెందిన డాక్టర్ వి.ఎల్. చైతన్య రెడ్డి, డాక్టర్ హర్షవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రజలకు అందుబాటు ధరల్లో ఆధునిక వైద్య సేవలు అందించాలనే సంకల్పంతో ఆసుపత్రిని ఏర్పాటు చేశామని తెలిపారు. అత్యవసర సమయాల్లో సైతం మెరుగైన వైద్య సేవలు అందించేందుకు తమ వైద్య బృందం సిద్ధంగా ఉంటుందని పేర్కొన్నారు.ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మాజీ మార్క్‌ఫెడ్ డైరెక్టర్ జగన్ మోహన్ రెడ్డి, అందోల్–జోగిపేట మున్సిపల్ చైర్మన్ సోమిరెడ్డి కృష్ణారెడ్డి, వైస్ చైర్మన్ ఆకుల సత్యనారాయణ (చిట్టిబాబు), మాజీ మున్సిపల్ చైర్మన్ గూడెం మల్లయ్య, 1వ వార్డు కౌన్సిలర్ గడ్డి అరుణ్, కోఆప్షన్ సభ్యులు డేవిడ్, జీషాన్, కౌన్సిలర్లు, మాజీ కౌన్సిలర్లు, ఆత్మ కమిటీ డైరెక్టర్లు, కార్యకర్తలు, ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

జోగిపేటలో మెఘా హాస్పిటల్ ప్రారంభం
మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: