వెలమ కార్పొరేషన్ చైర్మన్ జువ్వాడి నర్సింగరావు
నూతన రీడింగ్ రూమ్ ను ప్రారంభించిన నర్సింగరావు
తెలంగాణ కెరటం, జగిత్యాల ప్రతినిధి, నవంబర్ 22 : గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాల అని, మానవునికి తెలివితేటలు, బ్రతుకుతెరువు, సమాజాభివృద్ధి సామాజిక సేవలు, తెలియజేయుటకు గ్రంధాలయాలు మార్గదర్శకం అని, వెలమ సంక్షేమ కార్పొరేషన్ మొట్టమొదటి చైర్మన్, జువ్వాడి నర్సింగరావు అన్నారు. ఆదివారం కోరుట్ల పట్టణంలోని సి.ప్రభాకర్ భవన్ అంతస్తుపై ఎస్డిఎఫ్ నిధుల నుంచి రూ.04 లక్షలు కేటాయించి, నిర్మించిన నూతన అధ్యయన కేంద్రం (రీడింగ్ రూమ్)ను జువ్వాడి నర్సింగరావు, సిపిఐ రాష్ట్ర నాయకులు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డితో కలిసి ఆదివారం ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. జాతీయ ఉద్యమంలో మొదలైన గ్రంథాలయాలు నడుస్తున్న ప్రైవేటుగా గత 30 ఏళ్లుగా సిపిఐ కార్మిక నేత ప్రభాకర్ లైబ్రరీ పేరుతో కోరుట్ల డివిజన్ కేంద్రంలో అనేక రకాలుగా కార్యక్రమాలు, జరుపుతూ సమాజ సేవలో ప్రజలకు, అవసరమైన రీతిలో నడుస్తూ ప్రజలకు విద్యార్థులకు పాఠకులకు అనేక విధాలుగా ఉపయోగకరంగా ఉందని పేర్కొన్నారు. జిల్లాలోనే మంచి విజ్ఞాన కేంద్రంగా ఉచిత కోచింగ్, ఇతర పోటీ పరీక్షలకు ఉద్యోగాలకు సిద్ధమవుటకు పుస్తకాలు తెచ్చి, అందుబాటులో ఉండడం శుభపరిణామం అన్నారు. ఈ గ్రంథాలయమునకు నూతన రీడింగ్ రూమ్ లకు ప్రభుత్వపరంగా నాలుగు లక్షల రూపాయలు నిధులు అభివృద్ధికి మంజూరు చేయడం గర్వకారణం అని అన్నారు. అలాగే ప్రతి సంవత్సరం పదివేల రూపాయల పుస్తకాలకు, ఆర్థిక సహాయం క్రింద ఇతర కార్యక్రమాలకు అందిస్తానని హామీ ఇచ్చారు. ఈ గ్రంథాలయం మునుముందు అభివృద్ధిలో భాగంగా ముందుకు నడవాలని ఆశిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ తిరుమల వసంత గంగాధర్, వైస్ చైర్మన్ షాహిద్ ఉల్ ఆహాద్, వార్డు కౌన్సిలర్ లు రుద్ర సుజాత శ్రీనివాస్, తోట గంగాధర్, తెడ్డు శిరీష విజయ్, సిపిఐ జిల్లా కార్యదర్శి, గ్రంథాలయ గౌరవ అధ్యక్షులు చెన్న విశ్వనాథం, అధ్యక్షులు రాస భూమయ్య, ఉపాధ్యక్షులు సుతారి రాములు, ఎన్నం రాధా, కస్తూరి రాజన్న, ఎండి ఆలీ, సమీర్, వంశీ, ఇరుగురాల భూమేశ్వర్, మునుగోరి హనుమంతు తదితరులు పాల్గొన్నారు.
