నాగర్ కర్నూల్ ఎంపీ డాక్టర్ మల్లురవి.
తెలంగాణ కెరటం నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి (నవంబర్ 22 ):లక్ష్మీ రేఖ దాటి మాట్లాడిన ఎమ్మెల్యేలపై ఫిర్యాదు అందాయని నాగర్ కర్నూలు ఎంపీ డాక్టర్ మల్లు రవి అన్నారు ఆదివారం నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ తో కలిసి ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశం లో ఎంపీ డాక్టర్ మల్లు రవి మాట్లాడుతూ ఏర్పాటు చేశారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, జడ్చర్ల ఎమ్మెల్యే అనురాధ రెడ్డి,ఎమ్మెల్యేలు పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించడంపై నాకు ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. ఈనెల 26వ తేదీన నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట డివిజన్లోని పదర మండలం నల్లమల ప్రాంతంలోని మద్దిమడుగు గ్రామంలో చేపట్టబోయే వివిధ అభివృద్ధి పనులకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏనుమల రేవంత్ రెడ్డి భూమి పూజ చేయనున్నట్లు ఆయన తెలిపారు. అక్కడ దాదాపు రూపాయలు 133 కోట్ల నిధులతో పలు అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించనున్నారని తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ మాట్లాడుతూ ఈనెల 26వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సాయంత్రం మూడు గంటలకు వివిధ కార్యక్రమాలకు దాదాపు 153 కోట్ల ఎంతో అభివృద్ధి పనులకు భూమి పూజ చేయనున్నారని, మద్దిమడుగు ఆలయ నిర్మాణానికి రూపాయలు 25 కోట్లు, భగవాన్ సంత సేవాలాల్ ఆలయ నిర్మాణానికి రూపాయలు 38 కోట్లు, హరిత హోటల్‌కు రూపాయలు 15 కోట్లు, అదేవిధంగా గ్రామ మాడవీధుల వెడల్పులు, రోడ్డు వైండింగ్లు చేయటానికి దాదాపు రూపాయలు 55 కోట్లు పనులు చేపట్టడానికి ముఖ్యమంత్రి భూమి పూజ చేయనున్నట్లు వెల్లడించారు.
