Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

పేద కుటుంబాలకు ఇందిరమ్మ జీవిత బీమా భరోసా

Author
Posted By TELANGANA KERATAM
| 23 Nov 2026, 07:51 AM | 4 | Politics, తెలంగాణ
పేద కుటుంబాలకు ఇందిరమ్మ జీవిత బీమా భరోసా

 పీర్యా తండాలో నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించిన సర్పంచ్ రవళిక రమేష్

కౌడిపల్లి తెలంగాణ కెరటం నవంబర్ 22 మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం పీర్యా తండా గ్రామపంచాయతీలో ఇందిరమ్మ జీవిత బీమా పథకం నమోదు కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ నేనావత్ రవళిక రమేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని అమలు చేస్తున్న ఇందిరమ్మ జీవిత బీమా పథకం ఎంతో ఉపయోగకరమైనదని పేర్కొన్నారు. ముఖ్యంగా పేద, మధ్యతరగతి కుటుంబాలకు జీవిత బీమా ఆర్థిక భరోసా కల్పించడంతో పాటు కుటుంబ భద్రతకు తోడ్పడుతుందని తెలిపారు.గ్రామంలోని అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ పథకం వివరాలను తెలుసుకొని తమ పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి కుటుంబానికి చేరినప్పుడే వాటి లక్ష్యం నెరవేరుతుందని అన్నారు. ఎవరూ నిర్లక్ష్యం చేయకుండా నమోదు ప్రక్రియను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. గ్రామస్థులకు పథకంపై అవగాహన కల్పిస్తూ అర్హులైన వారందరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు.ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకొని ఆర్థిక భద్రత పొందాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: