Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

చింత శివరాజ్ అధ్యక్షులు , సింగారం మల్లేష్ మరియు కుత్బుల్లాపూర్ నియోజకవర్గ రజక సంఘం ఆధ్వర్యంలో, విజయవంతమైన రజక వన సమారాధన

Author
Posted By TELANGANA KERATAM
| 23 Nov 2026, 09:40 AM | 9 | Politics, తెలంగాణ
చింత శివరాజ్ అధ్యక్షులు , సింగారం మల్లేష్   మరియు కుత్బుల్లాపూర్  నియోజకవర్గ రజక సంఘం ఆధ్వర్యంలో,  విజయవంతమైన రజక వన సమారాధన

రిపోర్టర్ సతీష్ (తెలంగాణతెరటం 

కుత్బుల్లాపూర్  నియోజకవర్గ రజక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్తీక వన సమారాధన కార్యక్రమం అత్యంత విజయవంతంగా జరగడం మనందరికీ ఎంతో ఆనందంగా, గర్వంగా ఉంది.13 రిజిస్టర్డ్ రజక సంఘాలను ఒకే వేదికపైకి తీసుకురావడమే కాకుండా, అన్ని సంఘాల ప్రతినిధులు, రజక సోదరులు, సోదరీమణుల నుంచి అద్భుతమైన స్పందన రావడం మన ఐక్యతకు నిదర్శనం.గత 15 రోజులుగా రాత్రింబవళ్లు శ్రమించి, తమ వ్యక్తిగత సమయాన్ని సైతం కేటాయించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన కుత్బుల్లాపూర్ నియోజకవర్గ రజక  సంఘం  కార్యవర్గ సభ్యులందరికీ ఈ విజయాన్ని అంకితం చేస్తున్నాను.ముఖ్యంగా ఆర్థికంగా, వ్యక్తిగతంగా, సమయాన్ని కేటాయించి సహకరించిన సంఘాలకు మా ప్రత్యేక కృతజ్ఞతలు:, దాతలకు, ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు.ఈ కార్యక్రమానికి విచ్చేసి మనల్ని ప్రోత్సహించిన గౌరవనీయ ఎమ్మెల్యే శ్రీ వివేకానంద గౌడ్ , మాజీ ఎమ్మెల్యే శ్రీ పైన శ్రీశైలం గౌడ్ ,  బీసీ "A" ఫెడరేషన్  చైర్మన్  శ్రీ అజయ్ కుమార్ కి, కార్పొరేటర్ జగన్ , రజక డిస్ట్రిక్ట్ చైర్మన్ శ్రీ పంజాగారి ఆంజనేయలు, కార్పొరేటర్ శ్రీ రావుల శేషగిరి , శ్రీ శేఖర్ యాదవ్  ,శ్రీ టీవీ ఆంజనేయలు గారికి   ప్రత్యేక ధన్యవాదాలు ఆలాగే నా ఆకాంక్ష ఒక్కటే...ఈ రోజు మనం చూపించిన ఐక్యత ఇలాగే కొనసాగాలి. మనమంతా కలిసికట్టుగా ఉండాలి. మన సమాజం ఆర్థికంగా, విద్యాపరంగా, సామాజికంగా అభివృద్ధి చెందాలి. మన పిల్లలకు మంచి భవిష్యత్తును అందించాలి. సమాజంలో గౌరవప్రదమైన స్థానాన్ని సంపాదించాలి.

ఈ విజయం ఎవరో ఒక్కరిది కాదు... ఇది మన 13 సంఘాల విజయం. ఇది ప్రతి రజక సోదరుడి విజయం. ఇది మన ఐక్యతకు లభించిన గౌరవం!
మరోసారి సహకరించిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా హృదయపూర్వక ధన్యవాదాలు.
చింత శివరాజ్అధ్యక్షులు,కుత్బుల్లాపూర్  నియోజకవర్గ రజక సంఘం

ఇవి కూడా చదవండి

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: