మ్.ర్.పి.స్ –మ్.స్.ఎఫ్ యాదాద్రి భువనగిరి జిల్లా ఇంచార్జ్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఈరోజు చౌలక్య గ్రాండ్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఎస్సీ వర్గీకరణ సాధన కోసం మ్.ర్.పి.స్ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ చేసిన పోరాటం మారవరనిది అని అన్నారు. ఎన్నో వ్యయప్రయాసలు, కష్టాలు, కన్నీళ్లను ఎదుర్కొంటూ 32 సంవత్సరాలకు పైగా వెన్ను చూపకుండా దండోరా ఉద్యమాన్ని ముందుకు నడిపించి ఎస్సీ వర్గీకరణ సాధించారని కొనియాడారు.
ఎస్సీ వర్గీకరణ ద్వారా సాధించిన ఫలాలను ప్రతి మాదిగ విద్యార్థి సద్వినియోగం చేసుకోవాలని, ఉన్నత విద్యను అభ్యసించి ఉన్నతమైన ఉద్యోగాలు సాధించాలని పిలుపునిచ్చారు. విద్యార్థులు తమ తల్లిదండ్రులకు, మాదిగ జాతికి గర్వకారణంగా నిలుస్తూ సమాజంలో గౌరవప్రదమైన గుర్తింపు తీసుకురావాలని ఆకాంక్షించారు.ఈ నెల 23వ తేదీన భువనగిరి పట్టణంలోని ఎ.ర్ గార్డెన్స్‌లో జరిగే మ్.స్.ఎఫ్ జిల్లా సదస్సుకు యాదాద్రి భువనగిరి జిల్లాలోని అన్ని మండలాల నుంచి మాదిగ విద్యార్థులు భారీ సంఖ్యలో తరలివచ్చి సదస్సును జయప్రదం చేయాలని కోరారు.ఈ సమావేశంలో పాల్గొన్నవారు:
మ్.స్.పి మాజీ జిల్లా అధ్యక్షుడు నల్ల చంద్రస్వామి మాదిగ,మ్.ర్.పి.స్ మాజీ జిల్లా అధ్యక్షుడు దుబ్బ రామకృష్ణ మాదిగ, మ్.ర్.పి.స్ మాజీ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఇటుకల దేవేందర్ మాదిగ, మ్.స్.పి జిల్లా మాజీ అధికార ప్రతినిధి సందేల శ్రీనివాస్ మాదిగ, మ్.ర్.పి.స్ భువనగిరి మండల అధ్యక్షుడు సుర్పంగా కుమార్ మాదిగ, మోత్కూరు మండల అధ్యక్షుడు కొంపల్లి పరుశారం మాదిగ, మ్.ర్.పి.స్ మాజీ పట్టణ అధ్యక్షుడు కోళ్ల జహంగీర్ మాదిగ, మ్.ర్.పి.స్ పట్టణ అధ్యక్షుడు అందే సాయి మాదిగ తదితరులు పాల్గొన్నారు.



