Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

పురాతన రాత పత్రాలు మన భవిష్యత్తుకు మార్గదర్శకాలు

Author
Posted By TELANGANA KERATAM
| 23 Nov 2026, 02:06 PM | 6 | Politics, TELANGANA, తెలంగాణ
పురాతన రాత పత్రాలు మన భవిష్యత్తుకు మార్గదర్శకాలు
రాష్ట్ర విశ్రాంత పురావస్తు అధికారి మల్లం వీరేంద్ర పురాతన రాత పత్రాలు మానవ జీవన భవిష్యత్తుకు మార్గదర్శకాల వంటివని వాటిని పరిరక్షించుకోవడం ప్రతి ఒక్కరి కర్తవ్యం అని ఇతిహాస సంకలన సమితి తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లం వీరేంద్ర తెలిపారు.ఇతిహాస సంకలన సమితి ఇందూరు జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఆదివారం రోజు సాయంత్రం నుండి రాత్రి వరకు నగరంలోని ప్రగతి నగర్ లో గల మాధవ సేవా సమితి కార్యాలయంలో నిర్వహించిన రాతప్రతుల అవగాహన సదస్సు కార్య క్రమానికి ముఖ్య వక్తగా విచ్చేసిన ఆయన మాట్లాడు తూ "మనందరం వాడుక భాషలో మాట్లాడుకునే రాత రాసిన వాడు బ్రహ్మ అనే పదం నుంచి మొదలుపెట్టిదే నని తేల్చి చెప్పారు.నేడు మనం రాస్తున్న కంప్యూటర్ రాతల వరకు ప్రతిదీ భవిష్యత్తు తరాలకు దిక్సూచి లాంటిదని గతం నుంచి పాఠాలను నేర్చుకొని జాతికి భవిష్యత్తు ఉండదు అనే విషయాన్ని ఎంతోమంది మహనీయులు చెప్పినట్టు ఆయన గుర్తు చేశారు.భారతదేశంలో వందల సంవత్సరాల పాటు విదేశీయు లు దాడులు చేసి ఆర్థిక సంపద ని మాత్రమే కాకుండా భార తీయుల జ్ఞాన సంపాదన కూడా కొల్లగొట్టారని మనం మర్చిపోకూడదని చెప్పారు, ఆయుర్వేదం జీవశాస్త్రం మరియు అంతరిక్ష పరిశోధన వంటి ఎన్నో అమూల్యమైన మన పూర్వీకులైన ఋషులు మునులు రచించిన గ్రంథాలను విదేశీయులు ఎత్తుకెళ్లారని వాటి ఆధారంగానే ఇప్పుడు అన్ని రంగాల్లో నూతన ఆవిష్క రణలు చేస్తున్నారని తెలిపారు. 
అభివృద్ధి చెందిన దేశాలుగా చెప్పుకునే దేశాలలో వారి అభివృద్ధికి కారణమైన గ్రంథాలను లోతుగా పరిశీలిస్తే అవన్నీ భారతీయ గ్రంథాలే అన్న విషయం మనకు స్పష్టంగా అర్థం అవుతుంది అని వారు తెలిపారు.జిల్లా శతాబ్ది ఉత్సవాల సమయంలో పురాతన రాత పత్రాలను డిజిటలైజేషన్ చేయటం కోసం వేసిన కమిటీకి కన్వీనర్ గా వ్యవహరించిన కలువకూట నరేష్ కుమార్ గారికి ఎన్నో ఊహకందని విషయాలు కనిపించినట్టు మల్లం వీరేంద్ర తెలిపారు. మారుమూల గ్రామాలలో చాలామంది పూజారుల ఇళ్లల్లో మరియు సామాన్య ప్రజల ఇండ్లలో కూడా పురాతన రాత పత్రాలు లభించినట్లు తెలిపారు. 
ఇతి హాస చెరిత్రలో కంద కుర్తి 
నిజామాబాదు జిల్లా కంద కుర్తి గ్రామంలో యాదవరావు గారి ఇంట్లోనే అమూల్యమైన ఆయుర్వేద పరిశోధనలకు సంబంధించిన రాత పత్రాలు లభించిన విషయాన్ని తెలుసు కున్న బాబారాందేవ్ గారు పతంజలి ఆయుర్వేద విశ్వ విద్యాలయం నుంచి ప్రొఫెసర్ల ను కందకుర్తికి పంపించి ఇక్కడే ఆరు నెలల పాటు ఉండి ఆరాత పత్రాలను డిజిటలైజ్ చేయించుకున్నారని మల్లం వీరేంద్ర వివరించారు.ఇలా 
రాత పత్రాలలో మన పూర్వీ కుల యొక్క జ్ఞాన సంపద మాత్రమే కాకుండా ఎన్నో అమూల్యమైన నిధుల యొక్క సమాచారం కూడా ఉండి ఉండవచ్చని వారు తెలిపారు. 
ప్రస్తుత కేంద్ర ప్రభుత్వము పురాతన రాత పత్రాలను సేకరణ చేసి డిజిటలైజ్ చేయడం కోసం ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించిన తరుణంలో మనందరం బాధ్య తాయుతమైన వ్యక్తులుగా మనకు తెలిసిన వారి దగ్గర లేదా మన దగ్గర ఉన్న రాత పత్రాలను సేకరించి వాటిని ప్రభుత్వానికి అందించడం ద్వారా ఎన్నో తెలియని విషయాలను వెలుగులోకి తీసుకు వచ్చిన వారం అవుతామని అందుకోసం మనమందరం కృషి చేయాలని తెలిపారు.ఇతిహాస సంకలన సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి కందకుర్తి ఆనంద్ మాట్లాడు తూ సంస్థ ప్రత్యేకంగా చరిత్రను అధ్యయనం చేయడం కోసం మాత్రమే పుట్టిందని అందు కోసం ప్రతి ఒక్కరికి ఈ విష యంలో సహాయ సహకారాలు అందిస్తుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు కలువకోట నరేష్ కుమార్, కార్యదర్శి అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ మర్రిపల్లి భూపతి, ఇతిహాస సంకలన సమితి సభ్యులు మరియు పరిశోధకు లు, అల్లకొండ ఖిల్లా పరిరక్షణ సమితి బాద్యులు,విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
అల్లకొండ చరిత్రను కాపాడు కుందాం 
అనంతరం బాల్కొండ కు చెందిన బి. ఆర్. నర్సింగ్ రావు "అల్లకొండ ఊరు ఉద్భవం - ఐదు ఆలయాలకు ప్రసిద్ధి' ఊరు చరిత్రను సభముకంగా ఆవిష్కరణ చేసారు. ఈ సందర్బంగా నర్సింగ్ రావు మాట్లాడుతూ బాల్కొండ ఖిల్లా అపారమైన చారిత్రక ప్రాధాన్య తను కలిగిన పురాతన కట్టడం ఉన్న ఖిల్లా మరమ్మతుల గురించి పట్టించు కొనే వారు లేక పోవడం విచార కరంగ ఉందని, బాల్కొండ అసెంబ్లీ నియోజకవర్గం నుండి యోదాను యోధులైన ఎమ్మెల్యేగా గెలిచి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రిగా,అసెంబ్లీ స్పీకర్ గ,. బి.ఆర్. ఎస్. ప్రభుత్వంలో రోడ్లు భవనాల శాఖ మంత్రిగా పనిచేసిన కూడా ఖిల్లా అభి వృద్ధి గురించి పట్టించుకోవడం లేక పోవడం విచార కరంగ ఉందని ప్రభుత్వం ఇప్ప టికైనా స్పందిం చి ఈ చారిత్రక సంపదను కాపాడా లని, బాల్కొండ ఖిల్లాకు పున రుజ్జీవం కల్పించి పర్యాటక కేంద్రంగా తీర్చి దిద్దాలని చరిత్రాభి మానులు కోరుతు న్నారు.సభలో ఉన్న ప్రముఖు లు చరిత్రను కాపాడు కుందా మని మన వారసత్వ సంపద ను భావితరాలకు అందిద్దాం!అని ముక్త కన్టంతో అన్నారు.

ఇవి కూడా చదవండి

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: