పరిశీలిస్తున్న ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ.
తెలంగాణ కెరటం నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి (నవంబర్ 23):ఈనెల 26వ తేదీన పదర మండలం మద్దిమడుగుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి విచ్చేసి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేయనున్న నేపథ్యంలో పర్యటన ఏర్పాట్లను సోమవారం టీపీసీసీ ఉపాధ్యక్షులు, డిసిసి అధ్యక్షులు,ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ రాష్ట్ర మంత్రివర్యులు అల్డురీ లక్ష్మణ్ కుమార్, నాగర్కర్నూల్ ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డి, దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం , ఎమ్మెల్సీలు శంకర్ నాయక్ , బెల్లయ్య నాయక్ , జిల్లా ఎస్పీ సంగ్రామ్ సింగ్ పాటిల్ మరియు ఉన్నతాధికారులతో కలిసి పరిశీలించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం పదర మండలం మద్దిమడుగులోని ప్రసిద్ధ శ్రీ పబ్బతి ఆంజనేయస్వామి ఆలయాన్ని ముఖ్యమంత్రి సందర్శించి పూజలు నిర్వహించనున్నారని, అలాగే ఆంజనేయస్వామి ఆలయ సమీపంలో 20 ఎకరాల విస్తీర్ణంలో సంత్ సేవాలాల్ మహారాజ్ గర్భగుడి, ఆలయం, విగ్రహ నిర్మాణానికి సీఎం గారు శంకుస్థాపన చేయనున్నారని,ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు కోసం రాష్ట్ర ప్రభుత్వం ₹200 కోట్ల నిధులు కేటాయించగా, తొలి విడత పనులకు ఇప్పటికే ₹38 కోట్లు విడుదల చేసిందని తెలిపారు.అనంతరం అచ్చంపేట పట్టణంలోని వై జంక్షన్ (వై జంక్షన్ ) వద్ద భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి గారు పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారని . నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన పలు కీలక పనులకు కూడా సీఎం గారు శ్రీకారం చుట్టనున్నారని అన్నారు.మద్దిమడుగు వేదికగా అభివృద్ధికి మరో చారిత్రాత్మక అడుగు.. అచ్చంపేట నియోజకవర్గ అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి పర్యటన సరికొత్త ఉత్సాహమనీ వారు తెలిపారు.
