Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

గురువుల ఆశీస్సులు.. స్నేహితుల సందడి.. 27 ఏళ్ల తర్వాత ఒక్కచోట చేరిన నవాబుపేట్ ZPHS 1997-98 పదో తరగతి బ్యాచ్!

Author
Posted By TELANGANA KERATAM
| 24 Nov 2026, 11:30 AM | 5 | TELANGANA, తెలంగాణ
గురువుల ఆశీస్సులు.. స్నేహితుల సందడి.. 27 ఏళ్ల తర్వాత ఒక్కచోట చేరిన నవాబుపేట్ ZPHS 1997-98 పదో తరగతి బ్యాచ్!
గురువుల ఆశీస్సులు.. స్నేహితుల సందడి.. 27 ఏళ్ల తర్వాత ఒక్కచోట చేరిన నవాబుపేట్ ZPHS 1997-98 పదో తరగతి బ్యాచ్!
వికారాబాద్ జిల్లా నవాబుపేట మండల కేంద్రంలోని ZPHS ఉన్నత పాఠశాలలో 1997-98 విద్యా సంవత్సరంలో పదో తరగతి చదువుకున్న పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఈరోజు నవాబుపేటలోని సాయి గార్డెన్స్‌లో అత్యంత వైభవంగా, అంగరంగ వైభవంగా జరిగింది.
దాదాపు 27 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత అప్పటి విద్యార్థినీ విద్యార్థులంతా ఒకేచోట చేరి చిన్ననాటి మధుర జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకుంటూ, పాత స్నేహాలను గుర్తు చేసుకుంటూ ఆనందంతో సందడి చేశారు.ఈ వేడుకకు విచ్చేసిన అప్పటి గురువులు, ఉపాధ్యాయులకు పూర్వ విద్యార్థులు ఘనంగా స్వాగతం పలికి, శాలువాలు కప్పి పూలమాలలతో ఘనంగా సత్కరించారు. తమ జీవితాలకు విద్యాబుద్ధులు నేర్పి, ఉన్నత స్థాయికి ఎదగడానికి పునాది వేసిన గురువుల పట్ల కృతజ్ఞతాభావాన్ని చాటుకున్నారు. గురువుల ఆశీస్సులు అందుకుంటూ ఆనందభరిత వాతావరణంలో వేడుకను నిర్వహించారు.

ఇవి కూడా చదవండి

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: