కార్తీక పౌర్ణమి సందర్భంగా కోనేరులో పంచసహస్ర దీపోత్సవంలో పాల్గొన్న బాధినేని రాజేందర్
ధర్మపురి: కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని ధర్మపురి పట్టణంలోని కోనేరులో నిర్వహించిన పంచసహస్ర దీపోత్సవ కార్యక్రమంలో ధర్మపురి మాజీ ఎంపీపీ, మాజీ పీఏసీఎస్ చైర్మన్, బుగ్గారం మండల తాజా మాజీ జెడ్పీటీసీ సభ్యులు శ్రీ బాధినేని రాజేందర్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా కోనేరులో వెలిగించిన వేలాది దీపాల మధ్య భక్తిశ్రద్ధలతో నిర్వహించిన దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక ఆధ్యాత్మిక వాతావరణాన్ని ఆస్వాదించారు. కార్తీక మాసం విశిష్టతను చాటుతూ నిర్వహించిన ఈ కార్యక్రమం భక్తులను ఆకట్టుకుంది.



