నిర్మల్ జిల్లా, పోన్కల్ గ్రామానికి చెందిన వికలాంగుడికి కేంద్ర ప్రభుత్వం ద్వారా ప్రత్యేక సైకిల్ అందడంతో ఆయన ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తనకు సహాయపడిన కేంద్ర ప్రభుత్వానికి, ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “నా లాంటి దివ్యాంగులకు అండగా నిలుస్తూ, మా ప్రయాణానికి తోడ్పడేలా సైకిల్ అందించిన ప్రధాని నరేంద్ర మోదీ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారం మాకు ఎంతో ఉపయోగకరంగా ఉంది. ఈ సైకిల్ నా రోజువారీ ప్రయాణానికి ఎంతో తోడ్పడుతుంది. దివ్యాంగుల సంక్షేమం కోసం ప్రభుత్వం చేస్తున్న కృషిని ఎప్పటికీ మర్చిపోలేను” అని ఆనందం వ్యక్తం చేసినట్లు కథనం.
ప్రజల అవసరాలను గుర్తించి దివ్యాంగులకు చేయూతనందిస్తున్న కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు వెల్లువెత్తుతున్నాయి.



