వైభవంగా కార్తీక మాస దీపోత్సవం
తెలంగాణ కెరటం, జగిత్యాల ప్రతినిధి, నవంబర్ 24 : కోరుట్ల పట్టణ బస్టాండ్ రోడ్ శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానంలో కార్తీక మాసం సందర్భంగా సోమవారం సాయంత్రం దీపోత్సవం కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. కార్యక్రమానికి ధర్మపురి దేవస్థానం మాజీ చైర్మన్ జువ్వాడి కృష్ణారావు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ పెంట అశోక్, ధర్మకర్తలు గుంటుక మహేష్, తోడేటి మహేష్, శ్రీమతి కండ్లే విజయలక్ష్మి, ఈవో విక్రమ్, జూనియర్ అసిస్టెంట్ పెడివెల్లి నర్సయ్య, అర్చకులు ఉద్దంటి శ్రీకాంత్, శ్రీధర్, శ్యాంసుందర్, పుప్పాల ప్రభాకర్, మాచపురం వెంకటేశ్వర్ రావు, భక్తులు, మహిళలు పాల్గొన్నారు.



