Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

రోడ్డు భద్రతపై ఘట్‌కేసర్ పోలీసుల అవగాహన*

Author
Posted By TELANGANA KERATAM
| 25 Nov 2026, 06:41 AM | 4 | Politics, తెలంగాణ
రోడ్డు భద్రతపై ఘట్‌కేసర్ పోలీసుల అవగాహన*
*రోడ్డు భద్రతపై ఘట్‌కేసర్ పోలీసుల అవగాహన*

*-అరైవ్ అలైవ్’ కార్యక్రమంతో వాహనదారులకు ట్రాఫిక్ నిబంధనలపై సూచనలు*

(తెలంగాణ కెరటం) ఘట్‌కేసర్ ప్రతినిధి / నవంబర్ 24: రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని ఘట్‌కేసర్ పోలీసులు సూచించారు. పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు ఘట్‌కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని యంనంపేట్ ఎక్స్ రోడ్డు వద్ద ఘట్‌కేసర్ ఎస్‌హెచ్‌ఓ ఆధ్వర్యంలో ఎస్‌ఐ, ట్రాఫిక్ ఏఎస్‌ఐ, పోలీస్ సిబ్బంది కలిసి ‘అరైవ్ అలైవ్’ పేరుతో రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వాహనదారులు, ద్విచక్ర వాహనదారులు, ప్రయాణికులు, ప్రజలతో పాటు ముఖ్యంగా విద్యార్థులు, యువతకు రోడ్డు భద్రత నియమాలు, ట్రాఫిక్ నిబంధనల ప్రాముఖ్యతను వివరించారు. అతివేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్, మద్యం సేవించి వాహనాలు నడపడం, వాహనం నడిపేటప్పుడు సెల్‌ఫోన్‌ ఉపయోగించడం వంటి చర్యలు ప్రమాదాలకు ప్రధాన కారణాలని తెలిపారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, కార్లలో ప్రయాణించే వారు సీట్‌బెల్ట్ పెట్టుకోవాలని సూచించారు. రోడ్డుపై ప్రయాణించే సమయంలో ట్రాఫిక్ నిబంధనలను కచ్చితంగా పాటించాలని, తమ ప్రాణాలను కాపాడుకోవడంతో పాటు ఇతరుల ప్రాణాలకు కూడా భద్రత కల్పించాలని పోలీసులు సూచించారు. రోడ్డు భద్రత అనేది ప్రతి ఒక్కరి బాధ్యత అని, చిన్నపాటి నిర్లక్ష్యం కూడా నిండు జీవితాలను బలిగొనే ప్రమాదం ఉందని హెచ్చరించారు. మీ భద్రతే మీ కుటుంబానికి భరోసా.. సురక్షితంగా ప్రయాణించండి.. క్షేమంగా గమ్యస్థానానికి చేరుకోండి అనే సందేశంతో కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఇవి కూడా చదవండి

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: