Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

నంచర్ల రామాలయంలో సామూహిక వ్రతాలు..

Author
Posted By TELANGANA KERATAM
| 25 Nov 2026, 06:45 AM | 4 | Politics, తెలంగాణ
నంచర్ల రామాలయంలో సామూహిక వ్రతాలు..
నంచర్ల రామాలయంలో సామూహిక వ్రతాలు..

తెలంగాణ కెరటం, జగిత్యాల ప్రతినిధి, నవంబర్ 24 : పెగడ పెల్లి మండలంలోని నంచర్ల గ్రామంలో శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని మంగళవారం సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించారు. ఈ వ్రత కార్యక్రమంలో నంచర్ల గ్రామంతో పాటు చుట్టు గ్రామాల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని, తమ మొక్కులను చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా బిజెపి ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మర్రిపెల్లి సత్యమ్ ఆధ్వర్యంలో అన్న ప్రసాద వితరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు గోలి జనార్దన్ రెడ్డి, బిజెపి పెగడపల్లి, మల్యాల మండల అధ్యక్షులు పల్లె మోహన్ రెడ్డి, గాజుల మల్లేశం దంపతులు బిజెపి ఓబీసీ మోర్చా మండల అధ్యక్షుడు కూన కుమార్, నాయకులు కడారి జనార్ధన్, పాలోజీ శ్రీరామ్ చారి, ఆలయ కోశాధికారి పోడేటి గంగాధర్, ఆలయ ప్రధాన అర్చకులు కూర్మాచలం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: