పాలెం ధర్మోరా పెద్దవాగు రోడ్డుపై ప్రయాణించాలంటే జంకుతున్న వాహనదారులు
ప్రమాదాలు జరగకముందే రక్షణ గోడ నిర్మించాలంటున్న ప్రజలు
తెలంగాణ కెరటం బాల్కొండ నియోజకవర్గం ప్రతినిధి నవంబర్ 24 :
నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండలంలోని పాలెం గ్రామం నుంచి ధర్మోరా వైపు వెళ్లే పెద్దవాగు చెక్ డ్యామ్ పై నిర్మించిన రోడ్డు మూల మలుపు రక్షణ గోడ లేకపోవడంతో ప్రయాణికులుతీవ్రఇబ్బందులుఎదుర్కొంటున్నారు. ఈ ప్రాంతంలో రక్షణ గోడ నిర్మించాలంటూ గతంలో పలుమార్లు పత్రికల్లోవార్తలుప్రచురితమైనప్పటికీసంబంధితఅధికారులుఇప్పటివరకుస్పందించకపోవడంపై స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఈ మార్గం మీదుగా నిత్యం ద్విచక్ర వాహనదారులు, ఆటోలు, ఇతర వాహనాలతో పాటు గ్రామస్తులు రాకపోకలు సాగిస్తుంటారు. రక్షణ గోడ లేకపోవడం వల్ల ప్రయాణ సమయంలో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో, వాహనాల రాకపోకలు ఎక్కువగా ఉన్న సమయంలో అప్రమత్తంగా ప్రయాణించాల్సిన పరిస్థితినెలకొందనిచెబుతున్నారు.గతంలోనే ఈ సమస్యను పత్రికల ద్వారా అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఏదైనా ప్రమాదం జరిగిన తర్వాత స్పందించడం కంటే ముందుగానే సమస్యను గుర్తించి పరిష్కరించడం అధికారుల బాధ్యత అని పేర్కొంటున్నారు.
సంబంధిత శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి, ప్రమాదాల నివారణకు అవసరమైన చోట వెంటనే రక్షణ గోడ నిర్మాణ పనులుచేపట్టి లైటింగ్ వ్యవస్థనుమెరుగుపరచాలని స్థానిక ప్రజలు, ప్రయాణికులు కోరుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రజల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు.



