బీర్పూర్ రోడ్ మైసమ్మ విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొన్న జగిత్యాల జిల్లా ఆటో యూనియన్ నాయకులు
జగిత్యాల జిల్లా బీర్పూర్ లో నిర్వహించిన శ్రీ మైసమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం భక్తిశ్రద్ధలతో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో జగిత్యాల జిల్లా ఆటో యూనియన్ అధ్యక్షుడు దేవర శ్రీనివాస్, జిల్లా కార్యదర్శి మడపతి ఉదయ్, ఎండీ పాషా, గంగాధర్, అంజన్న, గ్రామ సర్పంచ్ హరీష్, తిరుమల రాజేందర్, నవీన్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మైసమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో తోటి కార్మికులు, ఆటో యూనియన్ సభ్యులు చురుకుగా పాల్గొన్నారు.



