Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

యాదాద్రి భువనగిరి జిల్లా: ఎం.ఎస్.ఎఫ్ అధ్యక్షుడిగా కందుల శివ మాదిగ నియామకం – నూతన జిల్లా కమిటీ ప్రకటన

Author
Posted By TELANGANA KERATAM
| 25 Nov 2026, 07:06 AM | 5 | Politics, తెలంగాణ
యాదాద్రి భువనగిరి జిల్లా: ఎం.ఎస్.ఎఫ్ అధ్యక్షుడిగా కందుల శివ  మాదిగ నియామకం – నూతన జిల్లా కమిటీ ప్రకటన
యాదాద్రి భువనగిరి జిల్లా: ఎం.ఎస్.ఎఫ్ అధ్యక్షుడిగా కందుల శివ  మాదిగ నియామకం – నూతన జిల్లా కమిటీ ప్రకటన

యాదాద్రి భువనగిరి జిల్లా: మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ (ఎం.ఎస్.ఎఫ్ ) యాదాద్రి భువనగిరి జిల్లా స్థాయి కమిటీ ఎన్నికల సదస్సు నేడు ఎ.ఆర్ గార్డెన్ లో ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశంలో కందుల శివ మాదిగ ను ఎం.ఎస్.ఎఫ్ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడిగా నియమిస్తూ నూతన జిల్లా కార్యవర్గాన్ని ప్రకటించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎం.ఆర్.పి.ఎస్ ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జి కోళ్ల శివ మాదిగ 

మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ (ఎం.ఎస్.ఎఫ్ ) ఉమ్మడి నల్గొండ జిల్లా ఇన్‌చార్జి సందే కార్తీక్ మాదిగ

 బిర్రు మహేందర్ మాదిగ ఎం.ఆర్.పి.ఎస్ - ఎం.ఎస్.పి యాదాద్రి భువనగిరి జిల్లా ఇంచార్జ్ 
పాల్గొని నూతన కమిటీని ప్రకటించారు.

ఈ సందర్భంగా ముఖ్య అతిథులు  మాట్లాడుతూ.. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఎం.ఎస్.ఎఫ్ ను క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేయాలని, ప్రతి మాదిగ విద్యార్థి విద్యావంతుడిగా ఎదగాలనే లక్ష్యంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. ప్రతి విద్యార్థి కళాశాల బాట పట్టేలా ప్రోత్సహించాలని, మధ్యలోనే చదువు మానేసే విద్యార్థుల సంఖ్యను (డ్రాపౌట్స్) తగ్గించి మాదిగ సమాజంలో నిరక్షరాస్యతను నిర్మూలించేందుకు కృషి చేయాలన్నారు.

ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు, పెరుగుతున్న విద్యా ఫీజులు, స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ సమస్యలతో పాటు విద్యార్థుల హక్కుల కోసం ఎం.ఎస్.ఎఫ్ నిరంతరం పోరాటం చేయాలని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు పేదరికం కారణంగా ఎదుర్కొంటున్న విద్యా సమస్యలు, విద్యారంగంలో కొనసాగుతున్న అసమానతలు, వివక్షను రూపుమాపేందుకు విద్యార్థి సంఘం కృషి చేయాలని అన్నారు.

విద్య అనేది కేవలం వ్యక్తిగత అభివృద్ధి కోసమే కాకుండా సమాజంలో సామాజిక మార్పు తీసుకురావడానికి ఉపయోగపడాలని, అంబేడ్కర్ ఆశయ సాధనలో విద్యార్థులు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. సూర్యాపేట జిల్లాలోని ప్రతి మండలంలో, ప్రతి కళాశాలలో ఎం.ఎస్.ఎఫ్ కమిటీలను ఏర్పాటు చేసి విద్యార్థులను సంఘటితం చేయాలని సూచించారు.

యాదాద్రి భువనగిరి జిల్లా నూతన కార్యవర్గం

ముఖ్య అతిథులు, నాయకుల ఆధ్వర్యంలో ప్రకటించిన నూతన కమిటీ వివరాలు:

      జిల్లా అధ్యక్షుడు:
- కందుల శివ మాదిగ (M.Sc., B.Ed.)

 జిల్లా అధికార ప్రతినిధి:
- రేణిగుంట్ల చింటూ మాదిగ 

      ప్రధాన కార్యదర్శులు:
1. బోగరం నరేష్ మాదిగ
2. మెడి వినయ్ మాదిగ


  జిల్లా ఉపాధ్యక్షులు:
1,కందుల ప్రేమ్ రక్షిత మాదిగ 
2.దాసరి సుధీర్ మాదిగ


   జిల్లా కార్యదర్శులు:
1.బర్ల ప్రణయ్ మాదిగ
2.ఇంజ వరుణ్ మాదిగ
3.మోగిలిపక శివ మాదిగ
4.బూడిద పవన్ మాదిగ
5.కందుల కిరణ్ మాదిగ


       సహాయ కార్యదర్శి:
- 1.దాసరి నరేష్ మాదిగ
- 2.పొట్ట దివాకర్ మాదిగ
- 3.పులేపాక చరణ్ మాదిగ 
- 4.పుల్లూరి మనోజ్ మాదిగ
ప్రచార కార్యదర్శి ...
1.మామిడి మధు మాదిగ
2.పముకుంట్ల ఉద్వాల్ ప్రసాద్ మాదిగ 
3.గందమల్ల ప్రశాంత్ మాదిగ
4.మైలారం దినేష్ మాదిగ
5.బర్ల అమృత మాదిగ


ఈ సమావేశానికి ఎం.ఆర్.పి.ఎస్ మాజీ జిల్లా అధ్యక్షుడు దుబ్బ రామకృష్ణ మాదిగ  సభాధ్యక్షత వహించారు.

ఈ కార్యక్రమంలో
ఎం.ఆర్.పి.ఎస్ –ఎం.ఎస్.పి సీనియర్ నాయకులు ఎం.ఎస్.పి మాజీ జిల్లా అధ్యక్షులు నల్ల చంద్రస్వామి మాదిగ
 సందేల శ్రీనివాస్ మాదిగ
ఇటుకల దేవేందర్ మాదిగ
సుర్పంగా కుమార్ మాదిగ కోళ్ల జహంగీర్ మాదిగ అందే సాయి మాదిగవివిధ మండలాల అధ్యక్షులు..
కందుల నర్సింగరావు మాదిగ, కందుల నరేష్ మాదిగ, పొట్ట వెంకటేశం మాదిగ, బీబీనగర్ లక్ష్మణ్ మాదిగ, మోగిలిపక యాదగిరి మాదిగ కత్తి సాయి మాదిగ , కొంపల్లి పరుశారం మాదిగ , అనిల్ మాదిగ ,నరేష్ మాదిగ, నవీన్ మాదిగ, చీమకండ్ల శ్రీనివాస్ మాదిగ,పులేపాక విజయ్ మాదిగ వివిధ మండల ఎం.ఎస్.ఎఫ్ నాయకులు
 కొంపల్లి 
యాకరి నర్సింగరావు
క తదితర సీనియర్ నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన జిల్లా అధ్యక్షుడు కందుల శివ  మాదిగ మాట్లాడుతూ తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన నాయకులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, యాదాద్రి భువనగిరి జిల్లాలో ఎం.ఎస్.ఎఫ్ ను బలోపేతం చేయడానికి, విద్యార్థుల సమస్యల పరిష్కారానికి, మాదిగ విద్యార్థుల విద్యాభివృద్ధికి తన శక్తివంచన లేకుండా కృషి చేస్తానని తెలిపారు...

మీ.... ఇటుకల దేవేందర్ మాదిగ

ఇవి కూడా చదవండి

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: