Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

జీవితంలో ఏది శాశ్వతము కాదు*

Author
Posted By TELANGANA KERATAM
| 25 Nov 2026, 07:16 AM | 3 | Politics, తెలంగాణ
జీవితంలో ఏది శాశ్వతము కాదు*
*జీవితంలో ఏది శాశ్వతము కాదు*

*తెలంగాణా ఒక ల్యాండ్ ఆఫ్ సెలబ్రేషన్స్* 

*కోర్టులో న్యాయమూర్తి కన్నా న్యాయవాది పాత్ర గొప్పది* 
*----గౌరవ తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి విజయ్ సేన్  రెడ్డి*  

*న్యాయవాదులు సోషల్ ఇంజనీర్స్* 

*ఆకాశమే హద్దుగా న్యాయవాదులు ప్రాక్టీస్ చేయాలి* 
*-----గౌరవ తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సుద్దాల చలపతిరావు*
 
తూప్రాన్, నవంబర్, 24. తెలంగాణ కెరటం ప్రతినిధి:

 మెదక్ జిల్లా తూప్రాన్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కం ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టును  గౌరవ తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు విజయ్ సేన్ రెడ్డి, చలపతిరావు చేతుల మీదుగా మంగళవారం ఉదయం ప్రారంభించారు. 
అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో గౌరవ తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి విజయ్ సేన్ రెడ్డి మాట్లాడుతూ.. మెదక్ జిల్లాకు తనకు చాలా అనుబంధం ఉందని, ప్రధాన న్యాయమూర్తిగా కాక బంధువుల వచ్చానన్నారు. 
వ్యక్తి జీవితంలో ఏదీ శాశ్వతం కాదన్నారు. తెలంగాణ ఒక ల్యాండ్ ఆఫ్ సెలబ్రేషన్స్ అని, జీవితమే ప్రతిరోజు సెలబ్రేషన్ అని, సెలబ్రేషన్ చేసుకుంటూనే వాటికి తగ్గట్టుగా పని చేయాలన్నారు. జీవితంలో ప్రతి వ్యక్తి ముఖ్యమైన వారని అన్నారు. న్యాయవాద వృత్తి పవిత్రమైందని అందులో సృజనాత్మకత, స్వేచ్ఛ ఉంటాయన్నారు. సృజ నాత్మకత స్వేచ్ఛను మరి ఏ వృత్తిలో  చూడలేమన్నారు. జీవితంలో న్యాయవాద వృత్తిని బాధ్యతగా తీసుకున్నప్పుడు చాలా ఆలోచించాలన్నారు. కోర్టులో జడ్జి కన్నా లాయర్ పాత్ర చాలా గొప్పది అన్నారు. 
యువ లాయర్లు పబ్లిసిటీ పై ఆధారపడుతున్నారని, లాయర్ యొక్క మంచితరమే పబ్లిసిటీ అన్నారు. 
వృత్తి పై ఆదరణ కలిగి ఉండాలన్నారు.
 కేసుల విషయంలో జడ్జి కన్నా లాయర్లకి ఎక్కువ పేరు వస్తుందన్నారు. 
జడ్జిల యొక్క గొప్పతనాన్ని కేసు గెలిచిన వారు కాకుండా, ఓడిపోయిన కక్షిదారులు చెప్పాలి అదే జడ్జి గొప్పతనం అన్నారు. కోర్టుల్లో సిబ్బంది సమన్వయంతో పని చేయాలన్నారు.గౌరవ తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సుద్దాల చలపతిరావు మాట్లాడుతూ.. న్యాయవాదులు సోషల్ ఇంజనీర్లు అని ,న్యాయవాదులు ఆకాశమే హద్దుగా ప్రతిరోజు ప్రాక్టీస్ లో ఉండాలన్నారు. బాలలను పరిరక్షించాలని, సమన్వయంతో పని చేయాలని, భారతదేశ అభివృద్ధి చెందుతున్న దేశంగా ఎదుగుతుందన్నారు. గౌరవ మెదక్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి నీలిమ మాట్లాడుతూ.. హైకోర్టు న్యాయమూర్తులకు మెతుకు సీమకు స్వాగతం చెప్పారు. కక్షిదారుల సౌకర్యం కోసం, సత్వర సేవలు కోసం కోర్టును ఏర్పాటు చేయడం జరిగిందని, తూప్రాన్ పరిసర నాలుగు మండలాల  కక్షిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరం గౌరవ తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులకు శాలువా, మెమొంటోతో ఘనంగా సత్కరించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్, జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు,అదనపు ఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్, మున్సిపల్ చైర్ పర్సన్ రజిని, గౌరవ జిల్లా న్యాయమూర్తులు సాయి సిరి సౌజన్య, హేమలత , శుభవల్లి, సంతోష్ కుమార్, మెదక్ జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షులు జనార్దన్ రెడ్డి , సీనియర్ న్యాయవాదులు పోచయ్య ప్రతాపరెడ్డి, జితేందర్ , న్యాయవాదులు, కోర్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: