Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

భోగ శ్రావణిపై మున్సిపల్ చైర్మన్ వ్యాఖ్యలను ఖండిస్తున్నాం

Author
Posted By TELANGANA KERATAM
| 25 Nov 2026, 07:24 AM | 3 | Politics, తెలంగాణ
భోగ శ్రావణిపై మున్సిపల్ చైర్మన్ వ్యాఖ్యలను ఖండిస్తున్నాం
భోగ శ్రావణిపై మున్సిపల్ చైర్మన్ వ్యాఖ్యలను ఖండిస్తున్నాం

జగిత్యాలలో అభివృద్ధి ఉందా.. అవినీతి ఉందా..? చర్చకు సిద్ధం

చైర్ పర్సన్ తీరుపై బిజెపి నాయకుల ధ్వజం 

తెలంగాణ కెరటం, జగిత్యాల ప్రతినిధి, నవంబర్ 24 : బీజేపీ నాయకురాలు డాక్టర్ భోగ శ్రావణిపై మున్సిపల్ చైర్మన్ సమిండ్ల వాణి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని జగిత్యాల పట్టణ బీజేపీ అధ్యక్షుడు కాశెట్టి తిరుపతి, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ వేముల శ్రీనివాస్ అన్నారు. మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ.. భోగ శ్రావణిపై విమర్శలు చేసే ముందు మున్సిపాలిటీలో జరుగుతున్న అవినీతిని ఆపండి అని అన్నారు. జిల్లాలో 2,400 మంది చేనేత కార్మికులు పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకుంటే కేవలం 100 మందికే మంజూరయ్యాయని తెలిపారు. కల్లు గీత, చేనేత కార్మికుల సమస్యలపై భోగ శ్రావణి మాట్లాడితే కాంగ్రెస్ నాయకులు విమర్శించడం సరికాదన్నారు. మున్సిపాలిటీకి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు వస్తున్నప్పటికీ పనులకు టెండర్లు పిలవకుండా జాప్యం చేస్తున్నారని ఆరోపించారు. సుమారు 16 చెత్త వాహనాలు మూలనపడి ఉండటంతో పారిశుద్ధ్య నిర్వహణ దెబ్బతిందన్నారు. చైర్మన్ వార్డులోనే ఉన్న ఇంటిగ్రేటెడ్ మార్కెట్‌ను ఇప్పటికీ వినియోగంలోకి తీసుకురాలేదని విమర్శించారు. యావర్ రోడ్డు విస్తరణ పనులు ఎక్కడ ఆగిపోయాయని ప్రశ్నించారు. బీజేపీ నాయకుడు ఆముద రాజు మాట్లాడుతూ, భోగ శ్రావణిపై చైర్మన్ సమిండ్ల వాణి చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. గతంలో మున్సిపల్ చైర్మన్‌గా పనిచేసిన భోగ శ్రావణి హయాంలో జరిగిన అభివృద్ధిని చూసి నేర్చుకోవాలని సూచించారు. ఎమ్మెల్యే మెప్పు పొందేందుకే వాణి ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. జగిత్యాలలో అభివృద్ధి జరుగుతోందా.. అవినీతి జరుగుతోందా అనే అంశంపై బహిరంగ చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. చిత్తశుద్ధి ఉంటే యావర్ రోడ్డు విస్తరణ చేపట్టాలని డిమాండ్ చేశారు. జగిత్యాల అభివృద్ధికి ఎంపీ ధర్మపురి అరవింద్ కృషి చేస్తున్నారని, భోగ శ్రావణి చైర్మన్‌గా ఉన్న సమయంలో చేసిన అభివృద్ధిని గుర్తించిన ప్రజలు ఆమెకు సుమారు 40 వేల ఓట్లు వేశారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి జగిత్యాల పట్టణ అధ్యక్షులు కాశెట్టి తిరుపతి, బిజెపి మున్సిపల్ ఫ్లోర్ లీడర్ వేముల శ్రీనివాస్, జగిత్యాల పట్టణ ప్రధాన కార్యదర్శి ఆముదరాజు, బిజెపి లేబర్ సెల్ జిల్లా కన్వీనర్ కట్ట విజయ్, పవన్ సింగ్, ఇట్యాల రాము, ముద్దం నాగరాజు, జాజర్ల రాజు, దొగ్గలి విజయ్, ప్రభాకర్, కొండ్ర జగన్ తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: