Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

19 వార్డులో రోడ్లు డ్రైనేజీలు ఏర్పాటు చేయాలి

Author
Posted By TELANGANA KERATAM
| 26 Nov 2026, 01:22 AM | 3 | Politics, తెలంగాణ
19 వార్డులో రోడ్లు డ్రైనేజీలు ఏర్పాటు చేయాలి
బహుజన్ సమాజ్ పార్టీ డిమాండ్

తెలంగాణ కెరటం, నవంబర్ 25,మంచిర్యాల జిల్లా19 వ వార్డు లో పర్యటించిన రాష్ట్ర మంత్రివర్యులు గడ్డం వివేక్ వెంకట స్వామికి వినతిపత్రం అందజేసిన బహుజన సమాజ్ పార్టీ నాయకులు.ఈ సందర్భంగా బహుజన్ సమాజ్ పార్టీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు ముల్కల్ల రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ పాత బస్టాండ్ సమీపము లోని మున్సిపల్ కార్యాలయం వెనుకగల విద్యానగర్ ఎస్సీ ఎస్టీ కాలనీలో సుమారు 2000 కుటుంబాల వరకు నివసిస్తున్నాయి ఆ కాలనీలో మీదుగానే ముస్లిం సోదరులు పండగల సందర్భంగా ఈద్గా కి వెళ్తారు కాలనీలో రోడ్లు మరియు డ్రైనేజీలు సరిగ్గా లేకపోవడం వలన పలుమార్లు ప్రమాదాలు జరిగిన సంఘటనలు కూడా ఉన్నాయి ఈ కాలనీలు ఏర్పడి నాలుగు దశాబ్దాలు కావస్తున్నాయి కాలనీలో రోడ్లు డ్రైనేజీలు నిర్మించి ప్రజా అవసరాలు తీర్చాలని అలాగే దేవపూర్ రైల్వే గేట్ ప్రక్కన నుండి ఉప్పులేటి కిరణ్ ఇంటి వరకు సుమారుగా 300 మీటర్ల నూతన సిసి రోడ్డు డ్రైనేజీ నిర్మించాలని ఎస్సీ ఎస్టీ కాలనీ ప్రజల నుండి సంతకాలతో కూడిన వినతి పత్రం తెలంగాణ రాష్ట్ర కార్మిక ఉపాధి & భూగర్భ గనుల శాఖ మంత్రివర్యులు వివేక్ వెంకటస్వామి గారికి వినతి పత్రం అందజేసిన బహుజన సమాజ్ పార్టీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు ముల్కల్ల రాజేంద్రప్రసాద్, మంచిర్యాల ఈసీ మెంబర్ ఎండీ మతిన్ ఖాన్, చెన్నూరు నియోజకవర్గం అధ్యక్షులు గాజుల శంకర్, నాయకులు చింతల సంతోష్ తదితరులు పాల్గొన్నారు.

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: