Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

గ్రామ పంచాయతీ వార్డు మెంబర్లకు కనీస గౌరవ వేతనం కల్పించాలి!

Author
Posted By TELANGANA KERATAM
| 26 Nov 2026, 01:35 AM | 3 | Politics, తెలంగాణ
గ్రామ పంచాయతీ వార్డు మెంబర్లకు కనీస గౌరవ వేతనం కల్పించాలి!

మొమిన్ కలాస్ గ్రామపంచాయతీ వార్డ్ నెంబర్ మేడిపల్లి సాయి రెడ్డి డిమాండ్

ప్రజాసేవ చేస్తున్న వార్డు సభ్యులకు గుర్తింపు ఏదీ? తెలంగాణ కెరటం గ్రామ పంచాయతీల అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తూ, ప్రజల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం శ్రమిస్తున్న గ్రామ వార్డు మెంబర్లకు ప్రభుత్వం కనీస గౌరవ వేతనం అందించాలని మోమిన్ కలాన్ గ్రామ ఎనిమిదో వార్డు సభ్యుడు మేడిపల్లి సాయి రెడ్డి డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాల్లో ప్రజలకు ఏ సమస్య వచ్చినా ముందుగా గుర్తుకు వచ్చేది వార్డు మెంబర్లేనని, ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటూ ప్రతి సమస్య పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు. గ్రామంలో రోడ్లు, డ్రైనేజీలు, తాగునీరు, పారిశుద్ధ్యం, వీధి దీపాలు వంటి మౌలిక సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటున్నారని పేర్కొన్నారు.ప్రజల ఓట్లతో ఎన్నికై బాధ్యతలు చేపట్టిన వార్డు మెంబర్లు ఎలాంటి ఆర్థిక ప్రయోజనాలు ఆశించకుండా ప్రజాసేవలో ముందుంటున్నారని, అయితే వారి కష్టానికి తగిన గుర్తింపు, గౌరవం, కనీస వేతనం లేకపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామ అభివృద్ధిలో వార్డు సభ్యుల పాత్రను ప్రభుత్వం గుర్తించాలని కోరారు.ఎన్నికల్లో గెలిచిన వార్డు మెంబర్లకు పదవి మాత్రమే కాదు.. బాధ్యతలు కూడా అపారంగా ఉంటాయి. ప్రజల మధ్య ఉంటూ ప్రజా సమస్యలపై పోరాడే వారికి కనీస గౌరవ వేతనం కల్పించడం ప్రభుత్వ బాధ్యత.కాబట్టి తెలంగాణ ప్రభుత్వం తక్షణమే స్పందించి రాష్ట్రవ్యాప్తంగా గ్రామ పంచాయతీ వార్డు మెంబర్లకు నెలవారీ కనీస గౌరవ వేతనం ప్రకటించాలని, వారి సేవలకు తగిన గుర్తింపు కల్పించాలని మేడిపల్లి సాయి రెడ్డి డిమాండ్ చేశారు. వార్డు మెంబర్ల న్యాయమైన డిమా

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: