నూతన యూనిఫామ్ తో సోషల్ వెల్ఫేర్ - అట్రాక్షన్ గా యూనిఫామ్ - ఆనందం వ్యక్తం చేస్తున్న విద్యార్థులు
తెలంగాణ కెరటం,తాండూర్ ప్రతినిధి: తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు యూనిఫాంలు కొత్తగా పంపిణీ చేశారు. ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ విధానం విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. యూనిఫాంలో ఎంతో అట్రాక్షన్ గా విద్యార్థులు నిలిచాయి. యూనిఫామ్ తో పాటు టై, బెల్టు, ఐడి కార్డులు కూడా విద్యార్థులకు ఇచ్చారు. ఈ యూనిఫామ్ లు విద్యార్థులు వేసుకుంటే చూడడానికి ఎంతో అందంగా కనిపిస్తున్నాయి. విద్యార్థులు కూడా చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. గతంలో డబ్బాల డబ్బాల మాదిరిగా యూనిఫామ్ ఉండేది. ప్రస్తుతం లైట్ కలర్లో ఇవ్వడంతో విద్యార్థులకు ఎంత అట్రాక్షన్ అనిపించింది. దానికి తగినట్టుగానే రెడ్ కలర్ ప్యాంటు ఇవ్వడంతో ఈ కాంబినేషన్ అదిరిపోయిందని విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు అంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల కోసం ఎంతో ఖర్చు చేస్తుంది. విద్యార్థుల యొక్క చదువు బాగోగులను ఉపాధ్యాయులు చూసుకుంటున్నారు. యూనిఫామ్ లు చాలా బాగున్నాయి విద్యార్థులకు కొత్త యూనిఫాం చాలా బాగున్నాయి. చూడడానికి విద్యార్థులు ఎంతో అట్రాక్షన్ గా కనిపిస్తారు. విద్యార్థులు అందరూ ఒకే మాదిరిగా, ఒకే తిరులో ఉన్నారు. హాస్టల్ ఆవరణలో విద్యార్థులు యూనిఫామ్ వేసుకుంటే విద్యార్థులలో ఎంతో ఆనందం కనిపిస్తుంది. ఒకప్పుడు ఇచ్చిన యూనిఫాంలో కంటే ప్రస్తుత యూనిఫామ్ లు చాలా చక్కగా ఉన్నాయి. ప్రభుత్వం ఇటీవల కాలంలో యూనిఫాములతో పాటు బెల్టు, ఐడి కార్డ్, షూస్ మొదలైనవి ఇవ్వడం జరిగింది. విద్యార్థుల కోసం ప్రభుత్వం ఎంతో ఖర్చు చేస్తుంది. వీటిని విద్యార్థులు కూడా సద్వినియోగం చేసుకొని ముందుకు సాగాలని కోరుకుంటున్నాను.- నరేష్,పీఈటి, గురుకుల పాఠశాల, పెద్దేముల్
