Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

నైట్ కోర్టు ఏర్పాటుకు వ్యతిరేకంగా దుబ్బాక న్యాయవాదుల విధుల బహిష్కరణ-నైట్ కోర్టు ఏర్పాటు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నిరసన వ్యక్తం చేసిన న్యాయవాదులు

Author
Posted By Kancharala Shivakumar
| 26 Nov 2026, 06:27 AM | 14 | తెలంగాణ
నైట్ కోర్టు ఏర్పాటుకు వ్యతిరేకంగా దుబ్బాక న్యాయవాదుల విధుల బహిష్కరణ-నైట్ కోర్టు ఏర్పాటు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నిరసన వ్యక్తం చేసిన న్యాయవాదులు

దుబ్బాకప్రతినిధి, నవంబర్ 25,(తెలంగాణ కెరటం)

రాష్ట్ర ప్రభుత్వం నైట్ కోర్టుల ఏర్పాటుకు తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ దుబ్బాక కోర్టు న్యాయవాదులు విధులను బహిష్కరించి నిరసన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా న్యాయవాదులు మాట్లాడుతూ.. నైట్ కోర్టుల ఏర్పాటు వల్ల రోజువారీ కేసుల విచారణలో తారతమ్యాలు ఏర్పడే అవకాశం ఉందని, మరుసటి రోజు విచారించాల్సిన కేసులకు సంబంధించి ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితి ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. న్యాయవాదుల విధులు, కేసుల విచారణ క్రమంపై ప్రభావం పడుతుందని పేర్కొంటూ నైట్ కోర్టుల ఏర్పాటును వ్యతిరేకించారు.ఈ నిరసన కార్యక్రమంలో దుబ్బాక బార్ అసోసియేషన్ అధ్యక్షులు మరిపెద్ది సంజీవరెడ్డి, ఏజీపీ నాగరాజు రెడ్డి, భాస్కర్ రెడ్డి, ప్రతాప్ రెడ్డి, చిటికుల అశోక్, బైండ్ల చంద్రయ్య, కూరపాటి సంతోష్, బిక్షపతి, శ్రీనివాస్, శ్రీరాం రామకృష్ణ ప్రభు, బైండ్ల ప్రవీణ్ కుమార్, జ్ఞానేశ్వర్, మాడుగుల సంతోష్ యాదవ్ తదితర న్యాయవాదులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: