దుబ్బాక ప్రతినిధి, నవంబర్ 25,(తెలంగాణ కెరటం)
విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లోనూ ప్రతిభ కనబరిచి ఉన్నత స్థాయికి ఎదగాలని గాయత్రి వివేకానంద పాఠశాల ప్రధానోపాధ్యాయులు రేపాక భాస్కర్ రెడ్డి సూచించారు.
బుధవారం జూనియర్ కబడ్డీ పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులను ఆయన అభినందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్య ఎంత ముఖ్యమో క్రీడలు కూడా అంతే ప్రాధాన్యత కలిగి ఉంటాయని పేర్కొన్నారు. క్రీడల ద్వారా విద్యార్థుల్లో శారీరక దృఢత్వంతోపాటు క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, జట్టుగా పనిచేసే నైపుణ్యం పెంపొందుతాయని తెలిపారు. ప్రతి విద్యార్థి చదువుతోపాటు క్రీడల్లో ఆసక్తి కనబరిచి తమ ప్రతిభను చాటుకోవాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో పాఠశాల వైస్ ప్రిన్సిపాల్ బోడ సురేష్, గాజుల రేణుక, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.



