రైతులకు ఒరిగిందేమిటి?
జేఏసీ.
తెలంగాణ కెరటం నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి (నవంబర్ 25):
నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం అమ్రాబాద్ పరిసర గ్రామాల్లో జలసాధన బుధవారం జేఏసీ నాయకులు నేరుగా రైతులకు వద్దకు వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎనిమిది దశాబ్దాలుగా ఈ ప్రాంతానికి సాగునీరు అందిస్తామని, పాలకులు హామీలు ఇస్తున్నప్పటికీ నేటికీ రైతాంగానికి పూర్తిస్థాయిలో నీటి సౌకర్యం అందలేదని స్థానిక రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాగునీటి సమస్యతో పాటు సాగునీటి కొరత కారణంగా వ్యవసాయం తీవ్ర ఇబ్బందుల్లో పడుతోందని రైతులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారని, జలసాధన జేఏసీ కమిటీ నాయకులు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.



