రంగాపూర్ అయ్యప్ప సన్నిధానంలో భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు
లక్ష్మణ్ గురుస్వామి ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు
అయ్యప్ప స్వాములకు అన్నదానం చేసిన జాకారం శ్రీనివాస్ – ప్రేమ దంపతులు
నందిగామ నవంబర్ 25( తెలంగాణ కెరటం)
రంగాపూర్ గ్రామంలోని అయ్యప్ప సన్నిధానంలో లక్ష్మణ్ గురుస్వామి ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా అయ్యప్ప స్వాముల నామస్మరణతో సన్నిధానం ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంది ఈ కార్యక్రమంలో జాకారం శ్రీనివాస్, ప్రేమ దంపతులు అయ్యప్ప స్వాములకు భక్తితో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. స్వామివారికి సేవ చేయడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నామని వారు తెలిపారు ఈ సందర్భంగా అయ్యప్ప స్వాములు, భక్తులు పాల్గొని ప్రత్యేక పూజల్లో పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించారు.



