ముకురాల వారి వివాహ వేడుకల్లో పాల్గొన్న సంగారెడ్డి ఎమ్మెల్యే కాంటెస్టెడ్ అభ్యర్థి పులిమామిడి రాజు
తెలంగాణ, కెరటం స్టేట్ ఇంచార్జ్ షేక్ మహబూబ్ 25, నవంబర్
సంగారెడ్డి పట్టణంలోని గోకుల్ గార్డెన్స్‌లో మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ మనీష్ గౌడ్, సహస్రల వివాహ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
ఈ వివాహ వేడుకకు సంగారెడ్డి ఎమ్మెల్యే కాంటెస్టెడ్ అభ్యర్థి పులిమామిడి రాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన వధూవరులను ఆశీర్వదించి, వారికి హృదయపూర్వక వివాహ శుభాకాంక్షలు తెలియజేశారు.నూతన వధూవరుల వైవాహిక జీవితం సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, ఆనందంగా సాగాలని పులిమామిడి రాజు ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో పులిమామిడి రాజు వెంట మామిళ్ల ఆనంద్, మన్నె మల్లేశం, పి.ఎం.ఆర్. యువసేన నాయకులు తదితరులు పాల్గొన్నారు.



