పశువైద్య సహాయ డాక్టర్ భాస్కర్‌ను కలిసిన బీసీ యువజన నాయకులు
తెలంగాణ కెరటం | సూర్యాపేట జిల్లా
మునగాల, నవంబర్ 25:
మునగాల మండల కేంద్రంలోని పశు వైద్యశాల సహాయ డాక్టర్ భాస్కర్ గారిని తెలంగాణ జాతీయ బీసీ చైతన్య సమితి సూర్యాపేట జిల్లా బీసీ యువజన కార్యదర్శి సుంకరి నాగయ్య బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా మండలంలోని పశువుల ఆరోగ్య సంరక్షణ, వైద్య సేవల తీరుపై డాక్టర్‌తో ఆయన చర్చించారు. గ్రామీణ ప్రాంతాల్లోని పాడి రైతులకు మెరుగైన పశువైద్య సేవలు నిరంతరం అందుబాటులో ఉండేలా చూడాలని కోరారు.



