అచ్చంపేటకు వస్తున్న సీఎం రేవంత్ రెడ్డి పర్యటనను అడ్డుకుంటాం.
హామీలు అమలు చేయకుండా సీఎం ఏ ముఖం పెట్టుకుని వస్తున్నారు?
స్థానిక ఎమ్మెల్యే ఇచ్చిన హామీలకు సమాధానం చెప్పాలి.
ఎడెల్లి ఆంజనేయులు మాదిగ డిమాండ్.
తెలంగాణ కెరటం నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి (నవంబర్ 25):
తెలంగాణ రాష్ట్రంలోని అర్హులైన మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా అచ్చంపేటలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు కోటి మంది మహిళలకు చీరలు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించడం స్వాగతించదగిన విషయమే. అయితే అచ్చంపేట నియోజకవర్గ ప్రజల సమస్యలను పరిష్కరించకుండా కేవలం సంక్షేమ కార్యక్రమాల పేరుతో పర్యటనలు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.అచ్చంపేటను ఎడ్యుకేషన్ హబ్‌గా మారుస్తామని హామీ ఇచ్చిన స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ ఇప్పటివరకు ఏం సాధించారు.డిగ్రీ కళాశాల, నర్సింగ్ కళాశాల, పాలిటెక్నిక్ కళాశాల, ఆయుర్వేద కళాశాల ఏర్పాటు చేస్తామని ఇచ్చిన హామీలు ఏమయ్యాయి? మూడేళ్లు గడుస్తున్నా ఈ హామీలపై ఎందుకు స్పష్టమైన కార్యాచరణ లేదు? ముఖ్యమంత్రి దృష్టికి ఈ సమస్యలను తీసుకెళ్లడంలో స్థానిక ఎమ్మెల్యే పాత్ర ఏమిటి? ప్రజలకు ఇచ్చిన హామీలపై ఎమ్మెల్యే సమాధానం చెప్పాలి.
అచ్చంపేట నియోజకవర్గ విద్యార్థులు ఉన్నత విద్య కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన దుస్థితి కొనసాగుతోంది. యువతకు స్థానికంగా విద్య, ఉపాధి అవకాశాలు కల్పించడంలో పాలకులు ఎందుకు విఫలమవుతున్నారు?
మహిళలకు చీరలు ఇవ్వడం మాత్రమే అభివృద్ధి కాదు. విద్యార్థులకు కళాశాలలు, నిరుద్యోగులకు ఉపాధి, పేదలకు మెరుగైన వైద్యం, రైతులకు సాగునీరు కల్పించినప్పుడే నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుంది.
మా ప్రధాన డిమాండ్లు:అచ్చంపేటను ఎడ్యుకేషన్ హబ్‌గా అభివృద్ధి చేయాలి.డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలి.నర్సింగ్ కళాశాల మంజూరు చేయాలి.పాలిటెక్నిక్ కళాశాల ఏర్పాటు చేయాలి.ఆయుర్వేద కళాశాల ఏర్పాటు చేయాలి.నియోజకవర్గంలోని ప్రధాన ప్రజా సమస్యలకు పరిష్కారం చూపాలి.ఈ నేపథ్యంలో నవంబర్ 26న అచ్చంపేట పర్యటనకు వస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటనను ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ప్రజాస్వామ్య పద్ధతిలో అడ్డుకుని నిరసన తెలియజేస్తాం అని ఏడెల్లి ఆంజనేయులు మాదిగ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అచ్చంపేటకు వస్తున్న సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ కూడా ప్రజలకు ఇచ్చిన హామీలపై సమాధానం చెప్పాలని . ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చి, అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని మరిచిపోతే ప్రజలు చూస్తూ ఊరుకోరని .చీరలు కాదు విద్యాసంస్థలు కావాలి!ప్రచారాలు కాదు అభివృద్ధి కావాలి!
హామీలు కాదు.. అమలు చేసి చూపించాలి!
అచ్చంపేట ప్రజల ఆకాంక్షలను ప్రభుత్వం గుర్తించి పెండింగ్ హామీలపై స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు.



