Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

ఓం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వర్యై నమః కార్తీక మాస వనభోజనాలు – ఘన విజయం

Author
Posted By TELANGANA KERATAM
| 26 Nov 2026, 08:56 AM | 3 | Bhakti, తెలంగాణ
ఓం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వర్యై నమః కార్తీక మాస వనభోజనాలు – ఘన విజయం
ఓం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వర్యై నమః
కార్తీక మాస వనభోజనాలు – ఘన విజయం
రిపోర్టర్ సతీష్ (తెలంగాణ కెరటం) కుత్బుల్లాపూర్ నియోజక వర్గం
శ్రీ ఆర్య వైశ్య సంఘం బాచుపల్లి (వాసవి క్లబ్ బాచుపల్లి – 4192) వారి ఆధ్వర్యంలో  నిర్వహించిన కార్తీక మాస వనభోజనాల కార్యక్రమం అత్యంత వైభవంగా, విజయవంతంగా జరిగింది.ఈ కార్యక్రమంలో సుమారు 3,000 మంది పాల్గొని వేడుకను విజయవంతం చేశారు. ఈ వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా 102 మంది ఆర్య వైశ్య ఆడపడుచులు జగజ్జనని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి సామూహికంగా హారతి సమర్పించడం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది.పెద్దల కోసం ఆధ్యాత్మిక ప్రవచనాలు, చిన్నారుల కోసం ఆటలు మరియు వినోద కార్యక్రమాలు, విచ్చేసిన వారందరికీ రుచికరమైన విందు భోజనం, వివిధ వ్యాపార స్టాల్స్‌తో కార్యక్రమ ప్రాంగణం సందడిగా మారింది.
ఈ కార్యక్రమానికి చుట్టుపక్కల ప్రాంతాల్లోని వివిధ సంఘాల ప్రతినిధులు, సభ్యులు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని తమ సహకారం అందించడం ఎంతో ఆనందదాయకం. వారి భాగస్వామ్యం ఈ వేడుకకు మరింత ప్రత్యేకతను తీసుకువచ్చింది.ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడంలో కృషి చేసిన కార్యవర్గ సభ్యులు:
- అధ్యక్షులు: శ్రీకాంత్ 
- ఉపాధ్యక్షులు: వీరేష్ 
- ప్రధాన కార్యదర్శి: భద్రి గారు
- కోశాధికారి: రాఘవేంద్ర 
- సంయుక్త కార్యదర్శి:శ్రీనివాస్ 
- సోషల్ మీడియా ఇన్‌చార్జ్: నితేష్
- కార్యవర్గ సభ్యులు:అనిల్ , లక్ష్మయ్య 
వీరందరి సమిష్టి కృషి, ప్రణాళిక, పట్టుదలతో ఈ కార్యక్రమం ఇంతటి ఘనవిజయం సాధించింది.ఈ సందర్భంగా ఆర్థికంగా సహకరించిన దాతలకు, విరాళాలు అందించిన శ్రేయోభిలాషులకు, కార్యక్రమం కోసం అహర్నిశలు శ్రమించిన వాలంటీర్లకు, ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా సహకరించిన ప్రతి ఒక్కరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు.జగజ్జనని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దివ్య ఆశీస్సులతో భవిష్యత్తులో కూడా సమాజ ఐక్యత, సేవాభావం మరియు ఆధ్యాత్మికతను చాటిచెప్పే మరెన్నో కార్యక్రమాలను నిర్వహించాలని సంకల్పిస్తున్నాము.ఈ సేవా ప్రయాణంలో మీ అందరి ఆశీస్సులు, సహకారం మరియు ఆదరణ ఎల్లప్పుడూ ఇలాగే కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము.
శ్రీ ఆర్య వైశ్య సంఘం బాచుపల్లి
(వాసవి క్లబ్ బాచుపల్లి – 4192)
కార్యవర్గ సభ్యులు
మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు!
సేవే మా లక్ష్యం – సేవే మా మార్గం.

ఇవి కూడా చదవండి

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: