Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

విద్యార్థులకు కనీస వసతులు కరువు.. ప్రభుత్వ పాఠశాల దుస్థితిపై మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు

Author
Posted By TELANGANA KERATAM
| 26 Nov 2026, 04:57 PM | 3 | Politics, తెలంగాణ
విద్యార్థులకు కనీస వసతులు కరువు.. ప్రభుత్వ పాఠశాల దుస్థితిపై మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు
విద్యార్థులకు కనీస వసతులు కరువు.. ప్రభుత్వ పాఠశాల దుస్థితిపై మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు

- న్యాయ విద్యార్థి చెలిమెల మణివర్ధన్

తెలంగాణ కెరటం మనోహరాబాద్: మెదక్ జిల్లా మనోహరాబాద్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో బాలురకు కనీసం టాయిలెట్ల సౌకర్యం కూడా లేకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పాఠశాలలో కనీస మౌలిక వసతులు కల్పించడంలో నిర్లక్ష్యంపై న్యాయ విద్యార్థి చెలిమెల మణివర్ధన్ తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు.ఈ సందర్భంగా భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 కల్పించిన జీవించే హక్కులో భాగంగా విద్యార్థులకు ఆరోగ్యం, పరిశుభ్రత, గౌరవప్రదమైన జీవనానికి అవసరమైన ప్రాథమిక సౌకర్యాలు కల్పించాల్సిన ఆవశ్యకతను తన ఫిర్యాదులో వివరించారు.మణివర్ధన్ చేసిన ఫిర్యాదును కమిషన్ స్వీకరించి డైరీ నంబర్ 2023/IN/2026 కేటాయించింది. సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి పాఠశాలలో బాలురకు ప్రత్యేక టాయిలెట్లు నిర్మించడంతో పాటు సరిపడా నీటి సరఫరా,పారిశుద్ధ్య సౌకర్యాలు కల్పించాలని కోరారు.విద్యార్థులకు కనీస మౌలిక సదుపాయాలు కల్పించడం వారి ఆరోగ్యం, ఆత్మగౌరవం, హక్కులకు సంబంధించిన అంశమని, విద్యార్థులు ఇబ్బందులు పడకుండా ప్రభుత్వం, సంబంధిత అధికారులు వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని చెలిమెల మణివర్ధన్ విజ్ఞప్తి చేశారు.

ఇవి కూడా చదవండి

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: