Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

పత్తి పంట మాటున గంజాయి సాగు.. రూ.28.46 లక్షల విలువైన గంజాయి స్వాధీనం

Author
Posted By ELIGETI VAMSHI KRISHSNA
| 26 Nov 2026, 04:58 PM | 20 | తెలంగాణ
పత్తి పంట మాటున గంజాయి సాగు.. రూ.28.46 లక్షల విలువైన గంజాయి స్వాధీనం

📌నిందితుడి అరెస్ట్.. నిర్మల్ పోలీసుల ‘గంజాయి గస్తీ’తో అక్రమ సాగుకు చెక్ 

నిర్మల్ జిల్లా పోలీసుల ‘గంజాయి గస్తీ’ కార్యక్రమం సత్ఫలితాలిస్తోంది. మామడ మండలం తండ్ర గ్రామ పరిధిలోని ధన్జీనాయక్ తండా శివారులో పత్తి పంట మాటున అక్రమంగా సాగు చేస్తున్న గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో కున్సోత్ రవి (43) అనే రైతును అరెస్ట్ చేశారు.
పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో 204 పచ్చి గంజాయి మొక్కలు, 54 ఎండిన గంజాయి మొక్కలు, 5.320 కిలోల ఎండిన గంజాయి ఆకులను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ.28.46 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు.
అధిక ఆదాయం సంపాదించాలనే ఉద్దేశంతో పత్తి పంటతో పాటు అంతర పంటగా గంజాయి సాగు చేస్తున్నట్లు విచారణలో నిందితుడు వెల్లడించినట్లు పేర్కొన్నారు.
జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల ఆదేశాల మేరకు డీఎస్పీ శ్రీనివాస్ పర్యవేక్షణలో సోన్ సీఐ బి. గోవర్ధన్ రెడ్డి, మామడ ఎస్ఐ యు. మహేష్ ఆధ్వర్యంలో ఈ దాడులు నిర్వహించారు. దాడుల్లో పాల్గొన్న పోలీసు సిబ్బందిని ఎస్పీ అభినందించారు. గంజాయి సాగు, విక్రయాలు, రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. గంజాయి అక్రమ కార్యకలాపాలపై సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

ఇవి కూడా చదవండి

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: