Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

ఒక మహిళ ఒక కొండచిలువను పెంచుకొంటోందట.

Author
Posted By NARESH PIPPARA
| 26 Nov 2026, 05:04 PM | 5 | ఎడ్యుకేషన్, తెలంగాణ
ఒక మహిళ ఒక కొండచిలువను పెంచుకొంటోందట.
ఒక మహిళ ఒక కొండచిలువను పెంచుకొంటోందట.

*రోజూ తనకు కావలసిన ఆహారం అందిస్తూ అది వేగంగా పెరిగి పెద్దదవటం చూసిమురిసిపోయేదట.
*కొంత కాలం తర్వాత ఉన్నఫళంగా అది ఆహారం తీసుకోవడం మానేసిందట. తను బయట నుంచి ఇంటికి రాగానే ఒళ్లంతా చుట్టుకుని, తన నోటితో ఆమె తల మీద ముద్దు పెట్టడానికి ప్రయత్నం చేసేదట.
*ఇంత ప్రేమ వ్యక్తపరుస్తున్న కొండచిలువ ఆహారం తీసుకోకపోవడం చూసి తట్టుకోలేక ఆమె డాక్టర్ ని   తీసుకొచ్చి చూపించిందట.
*డాక్టర్ అమెతో ఇలా చెప్పాడు… “దీనికి ఎలాంటి జబ్బులు లేవు. కాకపోతే అది చేస్తున్న విన్యాసాలు ప్రేమతో కాదు. తను ఎన్ని రోజులు ఆహారం తీసుకోకపోతే నిన్ను తినేసి అరాయించుకోగలదో అంచనా వేస్తోంది. నీ శరీరాన్ని చుట్టుకోవడంలో ప్రేమ లేదు, నిన్ను చంపేందుకు తన శక్తి సరిపోతుందో లేదో చూసుకొంటోంది.
*నీ తల మీద అది ముద్దు పెట్టడానికి ప్రయత్నం చేయటం లేదు. నీ తల తన నోటికి సరిపోతుందో లేదో అని పరీక్షిస్తోంది" అని చెప్పాడట.
*కొన్ని స్నేహాలు కూడా....ఇలాగే ఉంటాయి.
*ఇలాంటి స్నేహితులు కొంత మంది మనతోనే ఉంటారు... మనతోనే తిరుగుతారు. మన బలాలు, బల హీనతలు బాగా తెలుసుకుని ముంచేస్తారు...
*అందుకే ఇలాంటి స్నేహితుల దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి సుమీ.

ఇవి కూడా చదవండి

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: