- ‘విద్యా క్షేత్ర’లో ఘనంగా బాలల దినోత్సవం
- చాచా నెహ్రూ కు నివాళులు
- వినోదం విజ్ఞానం సృజనాత్మకత మైళవించిన కార్యక్రమాలు
ఖమ్మం, నవంబర్ 14 (తెలంగాణ కెరటం): ప్రైవేటు విద్యారంగంలో తనదైన శైలితో అటు విద్యార్థులను ఇటు విద్యార్థుల తల్లి తండ్రులను వారి కలల సాధనకు .... ఆలంబనగా మారి న ‘విద్యాక్షేత్ర’ ప్రతి విషయంలో సామాజిక బాధ్యత తో స్పందిస్తుంది. విద్యార్డులు, భవిషత్తు సంపద. వారిని జాగ్రత్త గా కాపాడుకోవాలి. అనే దృక్పధం తో ‘విద్యాక్షేత్ర’ పండుగలు, వాటి ప్రాశస్త్యం, మహానీయులు వారి జీవిత చరిత్రలు, నైతిక విలువలు గురించి విద్యార్థులకు అవగాహన పర్చే పలు రకాల కళ ల తో తనదైన ముద్ర వేసుకుంది. నేడు నవంబర్ 14, మన దేశ తొలి ప్రధాని జవహర్లాల్ (చాచా) జయంతి. ఆయనకు పిల్లలంటే ప్రాణం. అందుకే ఈ రోజునా పిల్లల పండుగ భావించి, పిల్లలతో విభిన్న కళ రూపాల ప్రదర్శనలు నిర్వహిస్తుంటాం. ఈ నేపథ్యం లో విద్యాక్షేత్ర పలు రకాల ప్రదర్శనలకు వేదికగా మారింది. ఉదయం నుంచి సాయంత్రం వరకూ విద్యార్థుల చేత.... వినోదం, విజ్ఞానం, సృజనాత్మకత వేళబించిన ప్రదర్శనలు నిర్వహించింది. తొలుత మన దేశ ప్రధాని జవహర్లాల్ జయంతిని పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి పూలమా లలు వేసి నివాళులు అర్పించారు. పలు రకాల ప్రదర్శనల ద్వారా వ్యక్తి గత, సమూహికంగా విద్యార్థులలో గల ప్రతిభను ఆవిష్కరింప చేసింది. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ భారతి మాట్లాడుతూ... విద్యార్థులు చిన్నప్పటి నుంచే తమలో ఉన్న కళను ప్రదర్శించుకునేందుకు ‘విద్యాక్షేత్ర’లో అవకాశాలు మెండుగా ఉన్నాయని తెలిపారు. విద్యార్థులకు ఉన్న ట్యాలెంట్ ను ప్రోత్సహించేందుకు తమ పాఠశాల ముందుంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ సౌభాగ్య, డైరెక్టర్ నాగభూషణం, ఉపాధ్యాయులు, విద్యార్థులతోపాటు వారి తల్లిదండ్రులు కూడా వచ్చి ఎంతగానో రోజంతా ఆనందంగా గడిపారు.



