ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి చేతుల మీదుగా చెక్కులు, ఎల్‌ఓసీ పత్రాల పంపిణీ
వైద్య చికిత్సకు ఇబ్బందులు పడొద్దు.. ప్రభుత్వం అండగా ఉంటుంది
తెలంగాణ కెరటము
కల్వకుర్తి నియోజకవర్గ ప్రతినిధి
నవంబర్ 05
అనారోగ్యంతో బాధపడుతూ వైద్య చికిత్స పొందుతున్న పేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్‌ఎఫ్) అండగా నిలుస్తోందని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి తెలిపారు. నియోజకవర్గంలోని వివిధ మండలాలకు చెందిన లబ్ధిదారులకు ఆయన తన నివాసంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులతో పాటు ఎల్‌ఓసీ (లెటర్ ఆఫ్ క్రెడిట్) పత్రాలను అందజేశారు. ఆయా మండలాలకు చెందిన ముఖ్య నాయకుల సమక్షంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా లబ్ధిదారులను ఎమ్మెల్యే వ్యక్తిగతంగా పలకరించి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వైద్య చికిత్స విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవద్దని, అవసరమైన సమయంలో ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అర్హులైన పేదలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తామని తెలిపారు.
ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని, ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఎవరికీ వైద్యం అందకుండా ఉండకూడదనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా బాధిత కుటుంబాలకు ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు.

