Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

బాల్కొండ జడ్పీహెచ్‌ఎస్‌లో విజయవంతంగా ముగిసిన పేరెంట్ టీచర్ సమావేశం

Author
Posted By TELANGANA KERATAM
| 06 Nov 2026, 06:56 AM | 3 | ఎడ్యుకేషన్, తెలంగాణ
బాల్కొండ జడ్పీహెచ్‌ఎస్‌లో విజయవంతంగా ముగిసిన పేరెంట్ టీచర్ సమావేశం
బాల్కొండ జడ్పీహెచ్‌ఎస్‌లో విజయవంతంగా ముగిసిన పేరెంట్ టీచర్ సమావేశం

తెలంగాణ కెరటం బాల్కొండ నియోజకవర్గం ప్రతినిధి నవంబర్ 5:

నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన పేరెంట్–టీచర్ సమావేశం విజయవంతంగా ముగిసింది. విద్యార్థుల విద్యాభివృద్ధి, ఉత్తమ విద్యా ప్రమాణాల సాధనతో పాటు పాఠశాల అభ్యున్నతిలో తల్లిదండ్రుల భాగస్వామ్యాన్ని పెంపొందించాలనే లక్ష్యంతో ఈ సమావేశాన్ని నిర్వహించినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు బట్టు రాజేశ్వర్ తెలిపారు.
ఈ సందర్భంగా ఉపాధ్యాయులు విద్యార్థుల విద్యా ప్రగతి, చదువులో వారి సామర్థ్యం, క్రమశిక్షణ, హాజరు శాతం, పాఠ్యాంశాల వారీగా సాధించిన ప్రతిభ తదితర అంశాలను తల్లిదండ్రులకు వివరించారు. అనంతరం విద్యార్థుల హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డులను తల్లిదండ్రులకు అందజేశారు.తల్లిదండ్రుల సూచనలు స్వీకరణ:పిల్లల భవిష్యత్తును మరింత మెరుగ్గా తీర్చిదిద్దడంతో పాటు పాఠశాలలో మౌలిక వసతుల అభివృద్ధి, విద్యా ప్రమాణాల పెంపుదలకు సంబంధించి తల్లిదండ్రుల నుంచి విలువైన సూచనలు, సలహాలను స్వీకరించారు.పదో తరగతిలో 100 శాతం ఉత్తీర్ణతే లక్ష్యం:రాబోయే పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో విద్యార్థులు 100 శాతం ఉత్తీర్ణత సాధించేలా ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను రూపొందించామని ప్రధానోపాధ్యాయులు తెలిపారు. విద్యార్థుల సామర్థ్యాలను బట్టి ప్రత్యేక శిక్షణ తరగతులు, నిరంతర పర్యవేక్షణ, పునశ్చరణ తరగతులు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకోసంతల్లిదండ్రులు,ఉపాధ్యాయులుసమన్వయంతో పనిచేసినప్పుడే ఆశించిన విద్యా ఫలితాలు సాధ్యమవుతాయని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో పాఠశాల సీనియర్ ఉపాధ్యాయులు ఎం ప్రశాంత్ కుమార్ ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: