రిపోర్టర్ సతీష్ (తెలంగాణ కెరటం)
భారత స్వాతంత్ర్య సమరయోధూడు గొప్ప విద్యావేత్త,ప్రముఖ పాత్రికేయులు స్వతంత్ర భారతదేశ తొలి విద్యాశాఖమంత్రివర్యులు మౌలానా అబుల్ కలాం అజాద్ జన్శదినం సందర్భముగా ఈ రోజు సంగారెడ్డి జిల్లా,రాంచంద్రాపురం మండల కేంద్రం,కాచిరెడ్డిపల్లిలో గల ప్రాథమిక పాఠశాలలు పియస్ కాచిరెడ్డిపల్లి,పియస్ వడ్డెరగూడెం పాఠశాలల ఆవరణలో జాతీయ విద్యాదినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.మొదట ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించి,విద్యార్థులకు చాక్లేట్లను పంపిణిచేసారు.ఈ సందర్భముగా విశ్రాంత గజిటెడ్ ప్రధానోపాధ్యాయులు,తెలంగాణ గజిటెడ్ ప్రధానోపాధ్యాయుల సంఘం,రాష్ట్రవ్యవస్థాపక అధ్యక్షులు గుండం మోహన్ రెడ్డి మాట్లాడుతు మౌలానా అబుల్ కలాం అజాద్ భారత స్వాతంత్ర ఉద్యమములో క్రీయశీల పాత్ర పోషించాడని ముస్లింలను స్వాతంత్ర ఉద్యమంలో క్రీయశీల పాత్రపోషింపజేయడానికి అల్ హిలాల్ ఉర్దూ వారపత్రికను 1912లో స్థాపించి సాహిత్య ఉద్యమంద్వార స్వాతంత్ర్య ఉద్యమాన్ని ఉర్రూతలూగించినాడని,దానిని బ్రిటీష్ పాలకులు 1914లో నిషేదించిన,ఆయన ఉద్యమాన్ని విడనాడక 1916లో అల్ బలఘ పత్రికను స్థాపించి బ్రిటీష్ పాలకుల కుతంత్రాలను ఎండగడుతు హిందూ,ముస్లింల ఐక్యతకోసం సాహిత్య సమరం చేసారన్నారు.బ్రిటీష్ పాలకులు ఆ పత్రికను కూడ నిషేదించి,ఆపనను రాంచిలో యూద్దఖైదీని చేసిన,స్వాతంత్ర పోరాట బాటను వీడలేదన్నారు.జైలునుండి విడుదలైన తర్వాత ప్రత్యక్ష స్వాతంత్ర్య ఉద్యమ పోరాటంలో పాల్గోని ,భారత స్వాతంత్ర్య సాధనలో కీలక భూమిక వహించారన్నారు.స్వతంత్ర భారతావనికి తొలి విద్యామంత్రిగా విద్యావ్యవస్థ పరిపుష్ఠికి విశేష కృషిచేసారన్నారు.మొదటి ఐఐటిని,యూనివర్సిటి గ్రాంటు కమీషన్ [యూజీసి] ,కౌన్సిల్ ఫర్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రీయల్ రిసర్చ్( సియస్ ఐఆర్)లను నొలకొల్పి విద్యారంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారన్నారు.ఆయన విద్యారంగానికి చేసిన విశేష కృషికి గుర్తింపుగా కేంద్ర మానవ వనరుల అభివృద్ధిశాఖ 2008లో ఆయన జన్మదినాన్ని జాతీయ విద్యాదినోత్సవంగా ప్రకటించినందున,ఆనాటి నుండి ఆయన జన్మదినాన్ని జరుపుకుంటున్నామన్నారు. ఆయన ఆశయ సాధనలో ప్రతి ఒక్కరూ పయనించాలని,చదువుకున్న వ్యక్తే దేశానికీ శక్తి అని,అందరూ విద్యావంతులు అయి దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలన్నారు.పరోపకారమే పరామావధిగా,మానవీయ విలువల పెంపె మహా సంపదగా,ఉన్నంతలో సహయం చేసే గుణం అలవర్చుకొని,సమైక్యరాగంతో దేశాభివృద్ధిలో కీలక భాగస్వాములు కావాలని యువకిషోరాలకు పిలుపునిచ్చారు.మూట సహాయంకన్నా మాట సహాయమే గొప్పదని ,సహచరులకు మనోధైర్యాన్ని అందించుటలో,తనకున్న జ్ఞానాన్ని సహచరులకు పంచుటలో విద్యార్థులు కీలక భూమికవహించాలన్నారు. ఈ కార్యక్రమంలో పియస్ కాచిరెడ్డి ,పియస్ వడ్డెర గూడెం,పియస్ బాంబే కాలనీల ప్రధానోపాధ్యాలు పి. సరిత, ఏ.క్రిష్ణయ్య,మానయ్య ఉపాధ్యాయులు ఆర్. నర్సింగరావు,విద్యావాలంటీర్లు లహారిక,సుస్మిత,పాల్గొన్నారు.ఉపాధ్యాయులు ఆర్.నర్సింగరావు స్వాగత వచనంలతో ప్రారంభమైన సమావేశం ప్రధానోపాధ్యాయులు పి.సరిత వందన సమర్పణతో ముగిసింది.



