Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

కొనసాగుతున్న సబ్ జూనియర్ బాలుర కబడ్డీ శిక్షణ

Author
Posted By TELANGANA KERATAM
| 08 Nov 2026, 07:56 AM | 3 | ఎడ్యుకేషన్, తెలంగాణ
కొనసాగుతున్న సబ్ జూనియర్ బాలుర కబడ్డీ శిక్షణ
కొనసాగుతున్న సబ్ జూనియర్ బాలుర కబడ్డీ శిక్షణ  

తెలంగాణ కెరటం బాల్కొండ నియోజకవర్గం ప్రతినిధి నవంబర్ 7:

నిజామాబాద్ జిల్లా ముప్కాల్ మండల కేంద్రంలోని 'భూదేవ్ ఇండోర్ స్టేడియం'లో జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో అండర్-16 సబ్ జూనియర్ బాలుర జిల్లా కబడ్డీ జట్టును బీజేవైఎం రాష్ట్ర నాయకులు ఎన్. సంతోష్ కుమార్ పరిశీలించారు.జిల్లానలుమూలల నుంచి సుమారు 200 మంది కబడ్డీ క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొనగాక్రీడాకారులప్రతిభనుపరిశీలించిన ఎంపిక కమిటీ 25 మందితో కూడిన ప్రాబబుల్స్ జట్టును ఎంపిక చేసింది. ఎంపికైన క్రీడాకారులకు ఈ నెల 6వతేదీనుంచిశిక్షణతరగతులుప్రారంభంఅయ్యాయన్నారు. ఈ నెల11వతేదీవరకుప్రత్యేకశిక్షణశిబిరంకొనసాగుతుందని అన్నారు.ఈ శిక్షణ శిబిరం అనంతరం ప్రతిభ కనబరిచిన క్రీడాకారులతో చివరగా తుది జట్టును ఎంపిక చేయడం జరుగుతుందని వెల్లడించారు. తుది జట్టుకు ఎంపికైన క్రీడాకారులు వచ్చే డిసెంబర్ 12 నుంచి 14వ తేదీ వరకు వికారాబాద్ జిల్లాలో నిర్వహించనున్న 36వ అంతర్ జిల్లాల సబ్ జూనియర్ బాలుర కబడ్డీ ఛాంపియన్‌ షిప్ పోటీల్లో జిల్లా తరఫున ప్రాతినిధ్యం వహించనున్నట్లు జిల్లా కబడ్డీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కె.గంగాధర్ రెడ్డి తెలిపారు. క్రీడాకారుల రవాణా ఖర్చులకై తనవంతు ప్రయత్నంగా నాయకుడు సంతోష్ రూ.3వేల రూపాయలను అందించడం జరిగిందని తెలిపారు.ఈ కార్యక్రమంలో టి.సాయన్న, కట్ట గోపి, గద్దలగంగారాం,వ్యాయామ ఉపాధ్యాయులు, సీనియర్ కబడ్డీ క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: