బిజెపి నేతల ముందస్తు అరెస్ట్.
అరెస్టులతో పోరాటాన్ని నిలువరించలేరు.
బిజెపి నాయకులు.
తెలంగాణ కెరటం నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి (నవంబర్ 26):
సీఎం పర్యటన సందర్భంగా నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేటలో బీజేపీ నాయకులను పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు అక్రమ అరెస్టు కాంగ్రెస్ ప్రభుత్వ నిరంకుశ వైఖరికి నిదర్శనమని బిజెపి నాయకులు విమర్శించారు అరెస్టులతో పోరాటాన్ని నిలువరించలేరని అన్నారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అచ్చంపేట నియోజకవర్గ పర్యటన సందర్భంగా
గురువారం ఉదయం బీజేపీ సోషల్ మీడియా జిల్లా ఇన్‌చార్జి అఖిల్ రెడ్డి, బీజేపీ నాయకులు చందు లాల్ చౌహాన్, కార్తీక్ రెడ్డిలను పోలీసులు ముందస్తుగా అక్రమంగా అరెస్టు చేయడాన్ని వారు తీవ్రంగా ఖండించారు. కొంతమంది నేతలను ఉప్పునుంతల పోలీస్ స్టేషన్ కు తరలించారు. ప్రజాస్వామ్యంలో ప్రజా సమస్యలపై ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరికీ ఉందని . ఇచ్చిన హామీలను నిలదీస్తారనే భయంతో బీజేపీ నాయకులను ముందస్తు అరెస్టులు చేయించడం కాంగ్రెస్ ప్రభుత్వ నిరంకుశ వైఖరికి నిదర్శనం. ఆగ్రహం వ్యక్తం చేశారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అచ్చంపేట నియోజకవర్గానికి వచ్చిన ప్రతిసారీ తనను తాను నల్లమల పులిబిడ్డగా చెప్పుకుంటున్నారు. కానీ నల్లమల బిడ్డనని చెప్పుకునే మీరు అచ్చంపేట అభివృద్ధికి ఏం చేశారు? నియోజకవర్గానికి ఎన్ని నిధులు కేటాయించారు? యువతకు, నిరుద్యోగులకు, రైతులకు ఇచ్చిన హామీల్లో ఎన్ని అమలు చేశారు?ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా, అభివృద్ధి పేరుతో ప్రచార ఆర్భాటాలు చేయడం వల్ల ప్రజలకు ఒరిగేదేమిటి ప్రశ్నించారు.
అచ్చంపేట అభివృద్ధి కోసం బీజేపీ నిరంతరం పోరాటం చేస్తుంది. ప్రజల పక్షాన నిలబడి కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తూనే ఉంటుందని,అక్రమ అరెస్టులతో మా పోరాటాన్ని ఆపలేరు.. ప్రజా సమస్యలపై మా పోరాటం ఆగదన్నారు.



