Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

పంట మార్పిడి విధానాలపై రైతుల్లో ఎప్పటికప్పుడు అవగాహన కల్పించాలి:*

Author
Posted By ELIGETI VAMSHI KRISHSNA
| 26 Nov 2026, 07:22 PM | 6 | తెలంగాణ
పంట మార్పిడి విధానాలపై రైతుల్లో ఎప్పటికప్పుడు అవగాహన కల్పించాలి:*
📌జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా.
 పంట మార్పిడి విధానాలపై రైతుల్లో ఎప్పటికప్పుడు విస్తృత అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా ఆదేశించారు. గురువారం సాయంత్రం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో అధికారులతో వ్యవసాయ సంబంధిత అంశాలపై ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు.
       ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రస్తుత నీటి లభ్యత పరిస్థితుల నేపథ్యంలో తక్కువ నీటితో సులభంగా సాగయ్యే పంటలను మాత్రమే వేసేలా రైతులను అధికారులు ప్రోత్సహించాలని చెప్పారు. వరి పంటకు ప్రత్యామ్నాయంగా ఇతర పంటలను సాగు చేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. వ్యవసాయ శాఖ అధికారులంతా తప్పనిసరిగా క్షేత్రస్థాయిలో ఉంటూ రైతులకు సహకారం అందించాలన్నారు. వేసవిలో ఉష్ణోగ్రతలు పెరిగి, భూగర్భ జలాలు తగ్గిపోయే అవకాశం ఉన్నందున ఎక్కువ నీటితో పండే పంటలు వేస్తే రైతులు నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. ప్రస్తుత, రానున్న రోజుల్లోని వాతావరణ పరిస్థితులు, నీటి లభ్యత వివరాలను రైతులకు వివరిస్తూ వారిలో చైతన్యం కల్పించాలన్నారు. భూగర్భ జలాల స్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ ఉండాలని పేర్కొన్నారు.
           ఫార్మర్ రిజిస్ట్రీ ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలన్నారు. ఏవైనా సాంకేతికపరమైన సమస్యలు తలెత్తితే వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. మండలాల వారీగా ఫార్మర్ రిజిస్ట్రీ ప్రక్రియను సమీక్షించారు.
      ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి సుజాత, ఉద్యానవన పంటల అధికారి రమణ, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: