Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

హక్కులతో పాటు బాధ్యతలను గుర్తించాలి

Author
Posted By TELANGANA KERATAM
| 26 Nov 2026, 08:33 PM | 3 | Politics, తెలంగాణ
హక్కులతో పాటు బాధ్యతలను గుర్తించాలి
హక్కులతో పాటు బాధ్యతలను గుర్తించాలి

రాజ్యాంగ విలువలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి.. స్ఫూర్తి ఆర్గనైజేషన్ అధ్యక్షుడు కుంటోళ్ళ యాదయ్య

(తెలంగాణ కెరటం) ఘట్‌కేసర్ ప్రతినిధి / నవంబర్ 26: భారత రాజ్యాంగం పౌరులకు కల్పించిన హక్కులతో పాటు ప్రతి ఒక్కరూ తమ ప్రాథమిక విధులు, సామాజిక బాధ్యతలపై అవగాహన పెంపొందించుకోవాలని స్ఫూర్తి ఆర్గనైజేషన్ అధ్యక్షుడు కుంటోళ్ళ యాదయ్య పిలుపునిచ్చారు. ఘట్‌కేసర్ డివిజన్ పరిధిలోని ఎన్‌ఎఫ్‌సీ నగర్ సీనియర్ సిటిజన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ సమాజ అభివృద్ధికి శాస్త్రీయ ఆలోచనా విధానం ఎంతో అవసరమని పేర్కొన్నారు. మూఢనమ్మకాలు, వివక్ష, సామాజిక అసమానతలకు దూరంగా ఉంటూ ప్రతి ఒక్కరూ హేతుబద్ధమైన ఆలోచనా విధానాన్ని అలవర్చుకోవాలని సూచించారు. ప్రతి పౌరుడు రాజ్యాంగంపై అవగాహన కలిగి ఉండటంతో పాటు అందులో పొందుపరిచిన సమానత్వం, స్వేచ్ఛ, సౌభ్రాతృత్వం, న్యాయం వంటి మౌలిక విలువలను ఆచరణలో పెట్టాలని అన్నారు. ముఖ్యంగా సీనియర్ సిటిజన్లు తమ అనుభవాన్ని సమాజ శ్రేయస్సు కోసం వినియోగిస్తూ, సామాజిక రుగ్మతలను రూపుమాపేందుకు యువతకు మార్గదర్శకులుగా నిలవాలని కోరారు. అనంతరం స్ఫూర్తి ఆర్గనైజేషన్ తరఫున భారత రాజ్యాంగ గ్రంథాన్ని సీనియర్ సిటిజన్ అసోసియేషన్ ప్రతినిధులకు బహూకరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ జంపాల రమేష్, అసోసియేషన్ అధ్యక్షుడు మల్లయ్య, సభ్యులు సూర్యకాంత్, రామయ్య, యాదగిరి, మల్లేష్, పండిట్, కృష్ణారావు, సత్యనారాయణ, చంద్రయ్య, సత్యారావు, ఐలయ్య, వెంకటయ్య, లక్ష్మీపతి, నారాయణరెడ్డి, హరిచంద్ర, గజానంద్ తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: