Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

రాజ్యాంగ పరిరక్షణ మార్చ్‌లో పాల్గొన్న చెరుకు శ్రీనివాస్‌రెడ్డి

Author
Posted By Kancharala Shivakumar
| 27 Nov 2026, 08:49 AM | 18 | తెలంగాణ
రాజ్యాంగ పరిరక్షణ మార్చ్‌లో పాల్గొన్న చెరుకు శ్రీనివాస్‌రెడ్డి

దుబ్బాక ప్రతినిధి, నవంబర్ 26,(తెలంగాణ కెరటం)

భారత రాజ్యాంగ పరిరక్షణ, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణే లక్ష్యంగా టీపీసీసీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో నిర్వహించిన ‘సంవిధాన్‌ రక్షక్‌ మార్చ్‌’లో దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌చార్జి చెరుకు శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాజ్యాంగం కల్పించిన హక్కులు, ప్రజాస్వామ్య విలువలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఈ మార్చ్‌ను నిర్వహించారు. తొలుత హైదరాబాద్‌లోని లిబర్టీ వద్ద ఉన్న భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ విగ్రహానికి నాయకులు నివాళులర్పించారు. అనంతరం అక్కడి నుంచి నెక్లెస్‌ రోడ్డులోని మాజీ ప్రధాని ఇందిరాగాంధీ విగ్రహం వరకు మార్చ్‌ కొనసాగింది.ఎమ్మెల్సీ, టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్‌కుమార్‌ గౌడ్‌ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రాజ్యాంగం కల్పించిన హక్కులు, సమానత్వం, సామాజిక న్యాయం, లౌకికవాదం, ప్రజాస్వామ్య వ్యవస్థల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలని పిలుపునిచ్చారు. రాజ్యాంగ స్ఫూర్తిని భావితరాలకు అందించడంతో పాటు ప్రజాస్వామ్య విలువలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో చెరుకు శ్రీనివాస్‌రెడ్డితో పాటు తొగుట మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ చెరుకు విజయ్‌రెడ్డి, దౌల్తాబాద్‌ మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌ మద్దెల స్వామి, కాంగ్రెస్‌ పార్టీ సిద్దిపేట జిల్లా ప్రధాన కార్యదర్శి గణేష్‌ పంచమి, జిల్లా కార్యదర్శి పద్మారెడ్డి, దుబ్బాక నియోజకవర్గ కోఆర్డినేటర్‌ సోలిపేట ప్రసాద్‌రెడ్డి, సర్పంచులు బొక్కల నాగరాజు, పెరుమాండ్ల నర్సింలుతో పాటు పలువురు కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: