దుబ్బాక ప్రతినిధి, నవంబర్ 27,(తెలంగాణ కెరటం)
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల ఉచిత జీవిత బీమా పథకాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని 18వ వార్డు కౌన్సిలర్ శ్రీరాం సరస్వతి నరేందర్ కోరారు.శుక్రవారం దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని 18వ వార్డులో నీలకంఠ భజన మండలిలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని మున్సిపల్ కమిషనర్ మహేష్ కుమార్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఆకుల భరత్‌తో కలిసి ఆయన ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈ బీమా పథకానికి సంబంధించిన దరఖాస్తుల స్వీకరణ రెండు రోజులపాటు కొనసాగుతుందని తెలిపారు. మొదటిరోజు నీలకంఠ భజన మండలిలో, అనంతరం మున్సిపల్ కార్యాలయంలో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు పేర్కొన్నారు. అర్హులైన ప్రతి కుటుంబం ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ అధ్యక్షుడు మల్లుగారి రామచంద్రారెడ్డి, వార్డు ఆఫీసర్ సంధ్యారాణి, ఆర్‌పీ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.



