Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

నిర్మల్ జిల్లా వికలాంగుల సంఘం అధ్యక్షుడిగా పి. సురేష్ యాదవ్ ఏకగ్రీవ ఎన్నిక

Author
Posted By ELIGETI VAMSHI KRISHSNA
| 27 Nov 2026, 05:59 PM | 39 | తెలంగాణ
నిర్మల్ జిల్లా వికలాంగుల సంఘం అధ్యక్షుడిగా పి. సురేష్ యాదవ్ ఏకగ్రీవ ఎన్నిక
 నిర్మల్ జిల్లా వికలాంగుల సంఘం నూతన కమిటీ ఎన్నికలు గురువారం నిర్మల్‌లో నిర్వహించారు. ఈ ఎన్నికల్లో మామడ మండలం రాయధారి గ్రామానికి చెందిన పి. సురేష్ యాదవ్ జిల్లా అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

ఈ సందర్భంగా నూతన కార్యవర్గ సభ్యులను శాలువాలతో ఘనంగా సన్మానించారు. అనంతరం అధ్యక్షుడు సురేష్ యాదవ్ మాట్లాడుతూ.. జిల్లాలోని దివ్యాంగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని, పెన్షన్లు, ఉపాధి అవకాశాలు, పునరావాసం, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా పనిచేస్తానని తెలిపారు. దివ్యాంగుల హక్కుల పరిరక్షణ కోసం సంఘాన్ని మరింత బలోపేతం చేస్తానని పేర్కొన్నారు.

కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన దివ్యాంగులు, సంఘ నాయకులు పాల్గొని నూతన అధ్యక్షుడు సురేష్ యాదవ్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: