Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

ఆర్ఎంపీ, పీఎంపీ వైద్యులకు ఉచిత వైద్య శిక్షణ

Author
Posted By TELANGANA KERATAM
| 29 Nov 2026, 11:18 PM | 3 | Politics, తెలంగాణ
ఆర్ఎంపీ, పీఎంపీ వైద్యులకు ఉచిత వైద్య శిక్షణ
ఆర్ఎంపీ, పీఎంపీ వైద్యులకు ఉచిత వైద్య శిక్షణ

తెలంగాణ కెరటం, జగిత్యాల ప్రతినిధి, నవంబర్ 29 : కిడ్నీ, మూత్ర సంబంధిత వ్యాధులపై ప్రముఖ వైద్యుల అవగాహన సదస్సు గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు మెరుగైన ప్రాథమిక వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ఆర్ఎంపీ, పీఎంపీ వైద్యులకు ప్రముఖ వైద్యులు డాక్టర్ ఎం. శ్రీకాంత్ (యూరాలజిస్ట్), డాక్టర్ ఎం. సోమేశ్వర్ (జనరల్ మెడిసిన్) ఉచిత అవగాహన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా కిడ్నీ సమస్యలు, కిడ్నీలో రాళ్లు, మూత్రాశయంలో రాళ్లు, ప్రోస్టేట్ సమస్యలు, మూత్ర విసర్జన ఇబ్బందులు, యూరాలజికల్ క్యాన్సర్లు తదితర వ్యాధుల లక్షణాలు, ప్రాథమిక చికిత్స, రోగులను సరైన సమయంలో ఉన్నత వైద్యానికి ఎలా పంపించాలనే అంశాలపై వివరించారు. అదేవిధంగా అపెండిసైటిస్, హెర్నియా, డయాబెటిక్ ఫుట్ వంటి వ్యాధులపై అవగాహన కల్పించారు.గ్రామీణ ప్రాంతాల్లో నిరుపేదలకు వైద్య సేవలు అందించే క్రమంలో వ్యాధుల లక్షణాలను ప్రాథమిక దశలో గుర్తించడం, అత్యవసర పరిస్థితుల్లో తగిన ప్రథమ చికిత్స అందించడం, అవసరమైనప్పుడు నిపుణులైన వైద్యుల వద్దకు రోగులను పంపించడం ఎంతో ముఖ్యమని వైద్యులు సూచించారు. ఈ శిక్షణ కార్యక్రమాన్ని గ్రామీణ వైద్యులకు ఉచితంగా నిర్వహించడం విశేషం. ఈ కార్యక్రమంలో ఆర్ఎంపీ, పీఎంపీ అసోసియేషన్ అధ్యక్షులు సంద శ్రీపతి, ప్రధాన కార్యదర్శి కొక్కుల శ్రీనివాస్, ఉపాధ్యక్షులు సిద్ధిఖ్ అలీ, అబ్దుల్లా, అశోక్, నజీబ్ ఉల్లా, స్వామి, సత్యంతో పాటు పలువురు అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: